ఫ్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరుదైన గౌరవం ఇచ్చింది. ‘‘ ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరపున యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ ఈ అవార్డును మచ్చర్ కి ప్రదానం చేశారు. ఆయనతో పాటు ప్రమాద సమయంలో విమానంలో వున్న ఫ్లైట్ సిబ్బందిని కూడా సత్కరించారు.
కాగా సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన విమానం కాక్‌పిట్‌లో పైలట్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ దాడి చేశాడు. ఈ ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర రక్తస్రావమై కంటిచూపు మసకబారినా కెప్టెన్ ధైర్యాన్ని కోల్పోకుండా 170 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడాడు.
కాగా, ఇజ్రాయెల్ సర్కారు సైతం మచ్చర్‌కు ఆ దేశ అత్యున్నత శౌర్య పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను ప్రకటించింది.
సత్కార కార్యక్రమానికి స్మిత్ మచ్చర్ చేతికి కట్టు వేసుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు ఆయన గాయాన్ని పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 'నువ్వు ఎప్పుడు కోలుకుంటావు?' అని అధ్యక్షుడు ప్రశ్నించగా, కోలుకోవడానికి సుమారు రెండు నెలలు పట్టవచ్చని స్మిత్ సమాధానమిచ్చారు. దీనికి అధ్యక్షుడు సరదాగా స్పందిస్తూ.. 'నువ్వు కోలుకున్నాక నీకు ఎలా పోరాడాలో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను' అని చెప్పారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు.