అభివృద్ధి పథంలో భారత్ ముందుకు సాగుతోంది – సునీల్ అంబేకర్

VSK Telangana    31-Oct-2026
Total Views |


ఆర్ఎస్ఎస్

ఇండోర్‌లో అక్టోబర్ 31, 2026న జరిగిన అఖిల భారతీయ కార్యకార్య మండల్ బైఠక్ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ విలేకరులతో మాట్లాడారు. దేశంలో జరిగే ప్రతి ప్రజా ఉద్యమం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని, దుష్టశక్తులు వాటిని దుర్వినియోగం చేయకుండా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

 

గత ఏడాదితో పోలిస్తే 13,000 కంటే ఎక్కువ కొత్త రోజువారీ శాఖలు పెరగడం వల్ల ప్రస్తుతం మొత్తం రోజువారీ శాఖల సంఖ్య 1,01,151కి చేరింది. వారపు, నెలవారీ మిలన్‌లతో కలిపి మొత్తం 1,10,849 ప్రాంతాలకు సంఘ్ పని విస్తరించింది. శతాబ్ది సంవత్సరం సందర్భంలో దేశవ్యాప్తంగా 65,660 హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. ‘గృహ సంపర్క్ అభియాన్’ ద్వారా స్వయంసేవకులు నేరుగా ఇళ్లకు వెళ్లి ప్రజల విశేష ఆదరణ పొందారు.

 

ఈ శతాబ్ది వేడుకల్లో మహిళలు, యువతుల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. రాబోయే కాలంలో వారి కోసం మరిన్ని కొత్త కార్యక్రమాలు రూపొందిస్తారు. సంఘ్ స్వరూపమే యువ ఆధారితమైనది కావడంతో యువతను ఆకర్షించడానికి ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదని, గతేడాది శిక్షణ తరగతులకు సుమారు రెండు లక్షల మంది కొత్తవారు హాజరయ్యారని వివరించారు.

 

యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల అలవాటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కుటుంబ సామాజిక స్థాయిల్లో దీనిని అరికట్టడానికి వివిధ సంస్థలతో కలిసి విస్తృత అవగాహన ప్రచారాలు చేపడతామని తెలిపారు. జిల్లా, ప్రాంత్, క్షేత్ర స్థాయిల నుండి ప్రారంభమయ్యే ఆర్గనైజేషనల్ ఎన్నికల ప్రక్రియ వచ్చే మార్చి నెలలో నాగ్‌పూర్‌లో జరిగే అఖిల భారతీయ ప్రతినిధి సభలో సర్ కార్యవాహ్ ఎన్నికతో పూర్తవుతుంది.

 

సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ విదేశీ పర్యటనల్లో భారత నాగరికత ఆలోచనలు, ప్రపంచ శాంతి భావనలను వివరించారు. రాబోయే రోజుల్లో వివిధ దేశాలతో సంభాషణలను మరింత విస్తరిస్తారు. ఇక యుజిసి విడుదల చేసిన ఒక సర్క్యులర్ సమతుల్యంగా లేదని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాలని, సమాజం తన ఐక్యతను కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

 

దేశంలో ఎవరూ పేదరికానికి గురికాకుండా, భారత్ ఆర్థికంగా, సామాజికంగా, భద్రతా పరంగా శ్రేష్ఠమైన స్థాయికి చేరుకోవడమే 'పరమ వైభవ్' లక్ష్యమని, భారత్ సాధించే ప్రగతి ప్రపంచ సంక్షేమానికి దోహదపడుతుందని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.


 - ఆర్గనైజర్ సౌజన్యంతో