ఏపీలో పాక్ గూఢచర్య నెట్‌వర్క్ కలకలం: 13 మంది నేవీ సిబ్బంది అరెస్ట్

VSK Telangana    06-Oct-2026
Total Views |

 

 
నేవీ
భారత దేశ రక్షణ రంగాన్ని కుదిపేస్తున్న పాకిస్తాన్ గూఢచర్య నెట్‌వర్క్‌కు సంబంధించిన ఉదంతంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సాగుతున్న ఈ దేశద్రోహ వ్యవహారంపై రాష్ట్ర భద్రతా వ్యవస్థ అత్యంత అప్రమత్తమైంది. ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మందిపై నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. వీరిలో ఏకంగా పదమూడు మంది నౌకాదళ సిబ్బంది ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ వ్యూహాత్మక కేంద్రమైన విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ కార్యకలాపాలు, నేవీ స్థావరాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన రహస్యాలను విదేశీ శక్తులకు చేరవేస్తున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
 

ఈ గూఢచర్య వలయాన్ని ఛేదించేందుకు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’ పేరుతో భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పన్నెండు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు, విచారణలు నిర్వహించాయి. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు, వారు శత్రు దేశాల ఏజెన్సీలతో ఏవిధంగా సమాచారం పంచుకున్నారనేదానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. అనుమానితులు సాధారణ ఫోన్ కాల్స్‌కు బదులుగా అత్యంత సురక్షితమైన ఎన్‌‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ మార్గాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో పరిచయాలు పెంచుకుని, వలపు వల (హనీ ట్రాప్) లో చిక్కుకుని దేశ భద్రతను పణంగా పెట్టారనే ఆరోపణలు బలపడుతున్నాయి.

 

ఈ మొత్తం నెట్‌వర్క్‌లో ప్రదీప్ ముఖర్జీ అనే ముప్పై ఒక్క సంవత్సరాల నావికుడు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో విశాఖపట్నంలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లో విధులు నిర్వహించిన ఈ వ్యక్తి, సోషల్ మీడియా ఆధారిత హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డాడు. అందమైన ప్రొఫైల్స్‌తో నకిలీ ఖాతాల ద్వారా పరిచయం చేసుకున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు రక్షణ రంగానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని, నౌకాదళ కదలికలను చేరవేశాడనే పక్కా ఆధారాలను ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మిగతావారి పాత్రపై కూడా అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు. దేశ రక్షణను తాకట్టు పెట్టి శ
నేవీత్రు దేశాలకు సమాచారం అందిస్తున్న ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులందరినీ చట్టం ముందు నిలబెడతామని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి.