మహారాష్ట్రలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4న నిర్వహించిన 'సంస్కృతి దీక్షా' కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పూర్వీకుల సంస్కృతిలోకి, స్వధర్మానికి తిరిగి స్వాగతం పొందారు. మిషనరీ సంస్థలు మన సంస్కృతిని బలహీనపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను సాధువులు తీవ్రంగా ఖండించారు. తాము గిరిజన హిందువులమని, మోసాలు లేదా ప్రలోభాల ద్వారా ఎవరూ తమ పూర్వీకుల ధర్మాన్ని దూరం చేయలేరని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమాజాన్ని చైతన్యపరచడం మరియు రక్షించడం అందరి బాధ్యత అని వారు ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమం రెండు జిల్లాలు, పది బ్లాకులు మరియు మొత్తం 129 గ్రామాలలో విస్తృతంగా కొనసాగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 497 క్రైస్తవ కుటుంబాలు తమ పూర్వీకుల ధర్మాన్ని స్వీకరించాయి. ఈ కుటుంబాల నుండి మొత్తం 1,352 మంది సభ్యులు స్వధర్మానికి తిరిగి వచ్చారు; వీరిలో 763 మంది మహిళలు , 549 మంది పురుషులు ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క అత్యంత ప్రత్యేకత ఏమిటంటే, 11 మంది ఫాదర్ లూ , 17 మంది క్రైస్తవ పాస్టర్లు కూడా తమ పూర్వీకుల ధర్మాన్ని తిరిగి స్వీకరించడం విశేషం.
కార్యక్రమం ముగింపు సందర్భంగా స్వధర్మానికి తిరిగి వచ్చిన కుటుంబాలన్నింటికీ వారి కులదైవమైన 'యహమోగి మాత' విగ్రహాన్ని బహూకరించారు. అలాగే, ఆ కుటుంబాలన్నీ తమ వెంట 'హిజారి' అనగా సాంప్రదాయ కానుకలను తెచ్చి సమర్పించారు. మొత్తం 31 యజ్ఞ కుండాలు ఏర్పాటు చేసి, వేద మంత్రోచ్ఛారణలు మరియు గిరిజన సాంప్రదాయ ఆచారాలతో ఈ పవిత్ర కార్యక్రమం సంపూర్ణంగా ముగిసింది.