వాట్సాప్ సందేశం, పీడీఎఫ్ లేఖలు ట్రస్టే పంపుతోంది : అయోధ్య ట్రస్ట్ ధ్రువీకరణ

VSK Telangana    04-Nov-2026
Total Views |
 
tryst
 
అయోధ్య : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి విరాళాలు అందించిన భక్తులకు అందుతున్న వాట్సాప్ సందేశాలు మరియు పీడీఎఫ్ (PDF) లేఖల ప్రామాణికతను ధృవీకరిస్తూ, 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్ అధికారిక వివరణను విడుదల చేసింది.మందిర ట్రస్ట్ పేరుతో అందుతున్న దీపావళి శుభాకాంక్షల వాట్సాప్ సందేశాలు, ధన్యవాద లేఖలు రావడంతో కొందరు భక్తులు సందేహాలను లేవనెత్తడంతో ట్రస్ట్ ఈ ప్రకటన చేసింది.
 
ట్రస్ట్ పేరుతో వస్తున్న సందేశాలు, వాటికి జత చేసిన పీడీఎఫ్ లేఖలు నిజమైనవేనని, వాటిని స్వయంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టే పంపిస్తోందని ధ్రువీకరించింది. ఈ లేఖల్లో దీపావళి శుభాకాంక్షలతో పాటు, భవ్య రామమందిర నిర్మాణానికి రామభక్తులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ లేఖలపై ట్రస్టు ప్రధాన కార్యదర్శి పూజ్య స్వామి గోవిందదేవ గిరి జీ మహారాజ్ సంతకాలు ఉన్నాయని ట్రస్టు పేర్కొంది.
 
అంతేకాకుండా, భక్తులు తమ పేరు, నివాస చిరునామా, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి, లేఖలో పేర్కొన్న అధికారిక లింక్‌ను ఉపయోగించాలని ట్రస్టు కోరింది. ఈ సదుపాయం 2026 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధికారిక వెబ్ లింక్ ఎల్లప్పుడూ donor.srjbtkshetra.orgతోనే మొదలవుతుందని ట్రస్ట్ స్పష్టం చేసింది; కాబట్టి భక్తులు తమ సమాచారాన్ని సమర్పించే ముందు ఆ లింక్‌ను సరిచూసుకోవాలని సూచించింది.
 
వాట్సాప్ సందేశాలు మరియు పిడిఎఫ్ అటాచ్‌మెంట్‌లు నిజంగా ఆలయ ట్రస్ట్ ద్వారానే జారీ చేయబడ్డాయా లేదా అనే విషయంలో సందేహంలో ఉన్న భక్తులలోని గందరగోళాన్ని నివారించడమే ఈ వివరణ యొక్క లక్ష్యం. తదుపరి ధృవీకరణ లేదా సందేహాల కోసం, భక్తులు ట్రస్ట్ యొక్క అధికారిక హెల్ప్‌లైన్ నంబర్, +91 8009522111 ద్వారా లేదా [email protected]కు ఇమెయిల్ పంపడం ద్వారా సంప్రదించవచ్చు.