
అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నిపథ్ పథకం సర్వీస్ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎన్. రాజా సుబ్రమణి వెల్లడించారు. సాధారణంగా అగ్నివీర్‌లకు నాలుగేళ్ల సర్వీస్ కాలం ఉంటుంది. ఇది పూర్తయ్యాక వీరిలోని 25 శాతం మంది త్రివిధ దళాల శాశ్వత కేడర్‌కు ఎంపిక అవుతారు. అయితే ఎంపికవ్వని 75 శాతం మంది కోసం అగ్నిపథ్ సర్వీస్ కాలాన్ని కేంద్రం నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచింది. దీంతో ఆ 75 శాతం అగ్నివీర్‌లకు శాశ్వత కేడర్‌లో చేరేందుకు మరో అవకాశం దొరకనుంది. 2022లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం మంచి ఫలితాలనిచ్చిందని సుబ్రమణి తెలిపారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 18 వేల మంది అగ్నివీర్ లకు భారీ ఉపశమనం లభించింది. ప్రస్తుతం 3 లక్షల మంది అగ్నివీర్ లు త్రివిధ దళాల్లో సేవలు అందిస్తున్నారు. సంస్థాగత సామర్థ్యం, నిర్వహణ అవసరాలను దృష్టిలో వుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుబ్రమణి పేర్కొన్నారు.