కొచ్చి వంతెనపై ఆర్ఎస్ఎస్ కి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు...

VSK Telangana    05-Nov-2026
Total Views |

KOCHI 
 
కొచ్చి : కొచ్చి సమీపంలోని ఆలూవాలో మార్తాండ వర్మ వంతెన సమీపంలోని రోడ్డుపై ఆజాదీ’, ‘ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించండి’ అంటూ నినాదాలు వెలిశాయి. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు రాశారు. కేరళంలో జిహాదీ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మళ్లీ రేకెత్తుతున్నాయి.
 
నిజానికి మరమ్మత్తుల నిమిత్తం ఆ వంతెనను తాత్కాలికంగా మూసేశారు. ఈ వంతెనకు సమీపంలోనే ‘ఆజాదీ’, ‘నరేంద్ర మోదీ ఓటు దొంగ’, ‘జ్ఞానేష్‌కుమార్ – ఇది అయిపోయింది’, ‘ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించండి’ మరియు ‘ఓటు బచావో’ అంటూ హిందీలో రాసుకొచ్చారు.
 
నవంబర్ 4వ తేదీ ఉదయం 'జనం టీవీ' (Janam TV) ఈ ఘటన గురించి వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పదంగా పరిగణించి, దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో కొందరు ఈ రాతలను 'దేశ వ్యతిరేక చర్య'గా పేర్కొన్నారు.
 
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని నిరసనకారులు డిమాండ్ చేసినట్లు సమాచారం.కేరళలో జరుగుతున్న వరుస ఆందోళనకర పరిణామాలకు ఈ తాజా ఘటన తోడవడంతో, తీవ్రవాద కార్యకలాపాలు, జాతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.నిషేధిత 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' (PFI)కి రాజకీయ విభాగమైన 'సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా' (SDPI)కి చెందిన యువజన విభాగం 'యంగ్ డెమోక్రాట్స్' ఇటీవల నిర్వహించిన 'ఆజాదీ జ్వాల' నిరసన కార్యక్రమం నేపథ్యంలో, ఈ రాతలు కనిపించాయి.