‘అమ్మాయి ఇష్టం లేకుండా అత్యాచారం జరగదు : నీచ వ్యాఖ్యలు చేసిన సాజిద్ రషీదీ

VSK Telangana    06-Nov-2026
Total Views |
 
mulana
 
మహిళల ఆత్మగౌరవం, స్వేచ్ఛ మరియు నిర్ణయాధికార సామర్థ్యంపై సమాజంలో చర్చ నడుస్తున్న తరుణంలో, ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సో-కాల్డ్ (అని పిలువబడే) మౌలానాల ఆలోచనా సరళిపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తించాయి. హిందూ, ముస్లిం అమ్మాయిల తెలివితేటలపై ఆయన వ్యాఖ్యానిస్తూ, "అమ్మాయిల మెదడు మోకాళ్లలో ఉంటుంది" అని అన్నారు. అంతేకాకుండా అమ్మాయి లేదా మహిళ సమ్మతిలేకుండా లైంగిక దాడి జరుగదంటూ నీచంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలతో మౌలానాల ఆలోచనా దృక్పథంపై మరోసారి ప్రశ్నలు వస్తున్నాయి.
 
ఈ సంభాషణ సందర్భంగా, మహిళల ప్రేమ సంబంధాలు, ఉద్యోగాలు, పని ప్రదేశంలో ప్రమోషన్లు మరియు పురుషులతో వారి ప్రవర్తనపై కూడా ఆయన పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన వివాదానికి దారితీసిన అంశం ఏంటంటే అత్యాచార సంఘటనల సందర్భంలో మహిళల సమ్మతి, బాధ్యత గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా జరిగే నేరం యొక్క తీవ్రతను తగ్గించి చూపేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన ఈ ప్రకటనలు మహిళ పట్ల గౌరవం, లింగ సమానత్వం మరియు ప్రజా జీవితంలో బాధ్యతాయుతమైన ప్రకటనల అవసరంపై ఇప్పుడు అనేక ప్రశ్నలను
లేవనెత్తాయి.
 
మహిళల ఆత్మగౌరవం, స్వేచ్ఛ మరియు నిర్ణయాధికార సామర్థ్యంపై సమాజంలో చర్చ నడుస్తున్న తరుణంలో, ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సో-కాల్డ్ (అని పిలువబడే) మౌలానాల ఆలోచనా సరళిపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తించాయి. హిందూ, ముస్లిం అమ్మాయిల తెలివితేటలపై ఆయన వ్యాఖ్యానిస్తూ, "అమ్మాయిల మెదడు మోకాళ్లలో ఉంటుంది" అని అన్నారు.
 
ఈ సంభాషణ సందర్భంగా, మహిళల ప్రేమ సంబంధాలు, ఉద్యోగాలు, పని ప్రదేశంలో ప్రమోషన్లు మరియు పురుషులతో వారి ప్రవర్తనపై కూడా ఆయన పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన వివాదానికి దారితీసిన అంశం ఏంటంటే.. అత్యాచార సంఘటనల సందర్భంలో మహిళల సమ్మతి, బాధ్యత గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా జరిగే నేరం యొక్క తీవ్రతను తగ్గించి చూపేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన ఈ ప్రకటనలు మహిళ పట్ల గౌరవం, లింగ సమానత్వం మరియు ప్రజా జీవితంలో బాధ్యతాయుతమైన ప్రకటనల అవసరంపై ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
 
హిందూ, ముస్లిం అమ్మాయిలపై ఒకే తరహా వ్యాఖ్యలు
 
ముస్లిం అమ్మాయిలు హిందూ యువకుల వైపు ఆకర్షితులు కావడం అనే ప్రశ్నతో ఈ పాడ్‌కాస్ట్ సంభాషణ ప్రారంభమైంది. దీనికి రషీదీ మత విశ్వాసాలు, సామాజిక ప్రవర్తనను కారణాలుగా పేర్కొన్నారు. ముస్లిం యువకులు అమ్మాయిలకు దీన్ (మతం), ఇస్లాం విషయాలను వివరిస్తారని ఆయన చెప్పారు. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం, పెళ్లికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి ఒంటరిగా కలవడం సరైనది కాదు. ఆయన అభిప్రాయం ప్రకారం, కాలేజీలో చదువుతున్న కొందరు ముస్లిం అమ్మాయిలు తమతో మతపరమైన నిబంధనలు, ఖురాన్ గురించి చర్చించని యువకులతో ఉన్నప్పుడే ఎక్కువ సౌకర్యవంతంగా భావిస్తున్నారు. ఈ విధంగా ఆయన కేవలం ముస్లిం అమ్మాయిలనే బోనులో నిలబెట్టినట్లు కనిపిస్తోంది. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే ప్రభావితమవుతారని రషీదీ అన్నారు. ఒక యువకుడు మంచి రెస్టారెంట్‌లో భోజనం పెట్టించడం, బట్టలు కొనివ్వడం లేదా ఖరీదైన మొబైల్ ఫోన్ బహుమతిగా ఇవ్వడం చేస్తే వారు సంబంధానికి సిద్ధపడిపోతారని ఆయన పేర్కొన్నారు.
 
పాడ్‌కాస్ట్‌లో మహిళల ఉద్యోగాలు, పని ప్రదేశంలో పొందే ప్రమోషన్ల అంశం వచ్చినప్పుడు, చాలా మంది మహిళలు మంచి జీతం, ఉద్యోగం మరియు ప్రమోషన్ల ఎర చూపడం వల్ల ప్రభావితమవుతారని రషీదీ ఆరోపించారు. ప్రమోషన్లు పొందే మహిళల విషయంలో తరచుగా తప్పుడు పద్ధతులు అవలంబిస్తారని కూడా నోరు పారేసుకున్నారు.
 
ఈ సంభాషణలో పురుషుల పాత్ర గురించి అడిగినప్పుడు, ఆయన పురుషుల ప్రవర్తనను వారి ‘ఫిత్రత్’ (నైజం/స్వభావం) తో ముడిపెట్టారు. మహిళలను తమ ప్రభావంలోకి తెచ్చుకోవడానికి పురుషులు ఆశ జూపవచ్చని అన్నారు. ఈ విధంగా ఆయన వాదనలో పురుషుల అనుచిత ప్రవర్తన ప్రస్తావనకు వచ్చినప్పటికీ, చర్చకు మహిళల నిర్ణయాలనే ప్రధాన కేంద్రంగా ఉంచారు.
 
చట్టం ప్రకారం, అత్యాచారం అనేది తీవ్రమైన నేరం. దీని నిర్వచనం మరియు శిక్షా నిబంధనలు 'భారతీయ న్యాయ సంహిత'లో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. ఒక మహిళ ఇష్టానికి మరియు సమ్మతికి విరుద్ధంగా జరిగే లైంగిక చర్య నేరం కిందికి వస్తుంది. ఇటువంటి కేసుల్లో బాధితురాలి ప్రవర్తనను లేదా ఆమె నిర్ణయాలను ముడిపెట్టి నేరస్థుడి బాధ్యతను తప్పించలేరు.
 
మౌలానా సాజిద్ రషీదీ గతంలో కూడా అనేక రకాల బహిరంగ ప్రకటనల ద్వారా వివాదాస్పదమయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌పై ఆయన పేరుతో వచ్చిన వ్యాఖ్య, కన్వర్ యాత్రికులపై చేసిన వివాదాస్పద ప్రకటన మరియు హిందువుల జనాభాపై చేసిన ప్రకటనలు గతంలో సంచలనం సృష్టించాయి. ఈ ప్రకటనలు వేర్వేరు సందర్భాల్లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి.