నూతన ఆదాయపన్ను చట్టం -2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకునేలా ఫారమ్‌లను సరళతరం చేసామని చెప్పారు. ఎన్ఆర్ఎస్ కింద టీసీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రికార్డ్ సమంలో ఈ ప్రత్యక్ష పన్నుల కోడ్ ను పూర్తి చేసినట్లు తెలిపారు. దీనిలో ఆదాయపు పన్ను నిబంధనలు మరింత సరళతరం చేసినట్లు పేర్కొన్నారు. దీనిని త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు. పన్ను చెల్లింపుదారులు, కొత్త చట్టాన్ని అర్థం చేసుకోని వారికి తగినంత సమయం ఇస్తామని కూడా తెలిపారు.
ఈసారి పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ, దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త అధ్యాయానికి తెరలేపారు. 60 ఏళ్ల నాటి 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి తెస్తామని చెప్పారు. సంక్లిష్టంగా ఉన్న సెక్షన్లను 819 నుంచి 536కి తగ్గించి, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా దీనిని రూపొందించామని చెప్పారు.
గతేడాది ప్రకటించిన విధంగానే పన్ను శ్లాబులను ఉంచారు. అయితే సెక్షన్ 87ఏ కింద లభించే పన్ను రిబేట్ వల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను పడదు. దీనికి అదనంగా రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే, రూ.12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న శాలరీడ్ ఎంప్లాయిస్‌కు సున్నా పన్ను వర్తిస్తుంది.
ఐటీఆర్ గడువు పెంపు
పన్ను రిటర్నుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి రివైజ్డ్ రిటర్న్స్ ఇచ్చే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. ఐటీఆర్ ఫైలింగ్ రద్దీని తగ్గించేందుకు కొత్త గడువులను ప్రతిపాదించారు. ITR-1, ITR-2 దాఖలు చేసే వారికి జూలై 31 వరకు, ఆడిట్ అవసరం లేని వ్యాపారాలకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చారు.
2025 లో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని 20205 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 47 చాప్టర్లను 23 కి కుదిరించారు. 819 సెక్షన్లను 536 కి తగ్గించారు. పాత చట్టంలో 823 పేజీలుంటే, కొత్త దాంట్లో 622 పేజీలకు తగ్గించారు. కొత్త బిల్లు నిబంధనల కింద వేతన జీవుల జీతభత్యాలు, మినహాయింపులను కలిపి వుంచారు. గ్రాట్యూటీ, పింఛన్ కమ్యూనికేషన్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా వచ్చే నగదు పరిహారాలను వేతన సెక్షన్ లోనే కలిపారు.