మోహన్ భాగవత్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తినింపింది : సినీ ప్రముఖులు

VSK Telangana    10-Feb-2026
Total Views |
 
kaushal
 
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ముంబై కేంద్రంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘‘‘‘100 ఏళ్ల సంఘ యాత్ర - కొత్త ఆశయాలు’’ అన్న శీర్షికతో కార్యక్రమం జరిగింది. అందులో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై చిత్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. మోహన్ భాగవత్ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుందని అభివర్ణించారు.
 
మోహన్ భాగవత్ ఉపన్యాస శ్రేణి ఎంతో స్ఫూర్తిదాయకంగా వుందని, అలాగే సందర్భానుసారమైన చమత్కారాలు కూడా తమను బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. ‘‘ఆరెస్సెస్ వంద సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను. అంతర దృష్టితో వున్న మోహన్ భాగవత్ ఉపన్యాసం సాంతం విన్నాను. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోహన్ భాగవత్ మాటలు అత్యంత స్ఫూర్తిదాయకంగా వుంది. హాస్యం, ఛలోక్తులు కూడా వున్నాయి’’ అని పేర్కొన్నారు.
 
ఇక.. నటుడు విక్కీ కౌశల్ కూడా ఈ కార్యక్రమంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆరెస్సెస్ 100 ఏళ్ల ప్రయాణాన్ని వివరించే కార్యక్రమానికి హాజరవ్వడం ఆనందంగా వుందని, తనకెంతో ప్రత్యేకమైందన్నారు. ప్రత్యక్షంగా మోహన్ భాగవత్ ఉపన్యాసం మొదటి సారి తాను విన్నానని, తనపై బలమైన ముద్ర వేసిందన్నారు.