
పాఠశాలల్లో గణపతి పూజ, కలశ పూజ నిర్వహించి తర్వాత మంత్రోచ్ఛారణల జరిపించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలు కడిగి పసుపు, కుంకుమ రాసి పూలదండలు వేసి పాదాలకు నమస్కరించారు . తల్లిదండ్రులు విద్యార్థులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పిల్లలను దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పిల్లలకు ఇలాంటి సంస్కారాలను అందిస్తున్న ఏకైక పాఠశాలలు శ్రీ సరస్వతి శిశు మందిరాలని వివరించారు. అన్ని వర్గాల వారు కూడా తమ తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు .విద్యతోపాటు చక్కటి సంస్కారాలను నేటి తరానికి అందిస్తున్న సరస్వతి శిశు మందిరాలను, ఆచార్యులను అభినందించారు.