జమ్మూ కశ్మీర్ లోని కిష్త్ వాడలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు పాకిస్తానీ ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధాలున్నాయని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ముగ్గురి మృత దేహాలూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. భద్రతా ఏజెన్సీల ప్రాథమిక అంచనాల ప్రకారం మృతుల్లో ఒకరిని జైషే మహ్మద్ కమాండర్ సైఫుల్లాగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు నక్కి వున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కిష్త్ వాడలో ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే చత్రూ బెల్టులోని పాసెర్ కుట్ ప్రాంతంలోని ఓ గుడిసెలో ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. గుడిసెలో మంటలు చెలరేగడంతో మృతదేహాలు కాలిపోయాయి. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
20 సార్లు తప్పించుకున్నాడు.. చివరికి సైఫుల్లా హతం...
మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ సైఫుల్లాను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి. కిష్ట్వార్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, వీరిలో సైఫుల్లా కూడా ఉన్నాడు. రెండేళ్లుగా ఇదే ప్రాంతంలో అతను తిరుగుతూ 20 సార్లు తృటిలో తప్పించుకున్నాడు. ఎట్టకేలకు సైఫుల్లా ఖేల్ ఖతమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.