హైద్రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా గణేష్ సేన జాగో హిందూ జాతీయవాదుల చర్చా వేదిక జరిగింది.
తెలంగాణ, భాగ్యనగరం వ్యాప్తంగా ఉన్న సుమారు నలభైకి పైగా హిందూ సంఘాలు, వివిధ జాతీయవాద చానల్స్ జర్నలిస్టులు, మేధావులు పాల్గొన్నారు.
హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు, లవ్ జిహాద్ పై అవగాహన, దేశ ఐకమత్యాన్ని భంగం కలిగించేలా లెఫ్ట్ ఎకో సిస్టమ్ న్యారేటివ్ పై ఖండిస్తూ మాట్లాడారు. భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈమధ్యకాలంలో హిందువులపై నమోదైన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేయాలని, దేవాలయాలపై హిందూ అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, ఫుడ్ జిహాద్ అరికట్టేందుకు ప్రభుత్వం విఫలమైందని, హిందూ నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఫుడ్ జిహాద్ పైన పోరాటం మరింత ఉధృతం చేయాలని కులవృత్తుల ను సారక్షించుకునే లాగా, హిందూ వ్యాపారస్తులను సమన్వయ పరుస్తూ ఎకో సిస్టమ్ ను నిర్మాణం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
ఈ కార్యక్రమం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షతన సభ కార్యక్రమాన్ని డాక్టర్ రావినూతల శశిధర్ నిర్వహించారు. ఈకార్యక్రమం లో కరోడిమల్, రామరాజు, భాస్కర్, చంద్రశేఖర్, వెంకటేష్, కరుణ సాగర్ , సంజయ్ లు పాల్గొన్నారు.