‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ నినాదాలు.. భారత్ పై ప్రేమను చాటుకున్న విదేశీ టూరిస్ట్

VSK Telangana    04-Feb-2026
Total Views |
 
ellora
 
ఆస్ట్రేలియాకి చెందిన యాత్రికుడు డంకన్ మెక్ నాట్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎల్లోరా గుహలను సందర్శిస్తున్న సమంలో చారిత్రాత్మక కైలాస్ దేవాలయం ముందు నిలబడి.. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాడు. అక్కడే వున్న ఇతర పర్యాటకులు కూడా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కాసేపటికే ‘‘జై శ్రీరామ్’’ అంటూ కూడా నినాదాలు చేశాడు. వెంటనే అక్కడే వున్న పర్యాటకులు కూడా జై శ్రీరాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రతిస్పందించారు.
 
ఈ సమయంలో అతని ఆధార్ వెరిఫికేషన్ పూర్తైంది అంటూ ఓ నెటిజన్ జోక్ చేశారు. ‘‘నేను నా ఆధార్ కార్డుకు సిద్ధంగా వున్నానా?’’ అంటూ రాసుకొచ్చాడు. మరో వైపు సోషల్ మీడియా కేంద్రంగా డంకన్ ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని దర్శించుకున్నట్లు షేర్ చేశాడు.’’నేను భారత దేశంలో వున్నాను. ఇది చూడండి’’ అని రాసుకొచ్చాడు.
 
మరో వైపు నెటిజన్స్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. చాలా మంది నెటిజన్స్ చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్న ఎమోజీలతో స్పందించారు. మరి కొందరు వీడియో నచ్చింది అంటూ కామెంట్లు రాశారు. మరి కొందరు చమత్కార కామెంట్స్ కూడా చేశారు. ‘‘ఆధార్ ధృవీకరణ పూర్తైంది అంటూ మరి కొందరు రాశారు.
 
తన యూట్యూబ్ బయోలో, మెక్‌నాట్ తాను ప్రపంచాన్ని పర్యటించాలనే తన అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడు డంకన్ మెక్ నాట్. వివిధ సంస్కృతులను తెలుసుకోవడానికి, ప్రత్యేకమైన కథనాలను వెలికితీయడానికి, వివిధ రకాల ప్రజలతో మమేకం కావడానికి ఇలా ప్రయాణం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రపంచ సౌందర్యాన్ని అన్వేషిస్తూనే, తన వీడియోల ద్వారా 'మంచి అనుభూతులను' పంచాలని కోరుకుంటున్నానని తెలిపాడు.