అమృత్ సర్ దేవాలయంలో ‘‘వూజు’..’ ముస్లింకి రెండో సారి శిక్ష విధించిన కోర్టు

VSK Telangana    04-Feb-2026
Total Views |

swarna
 
అమృత్ సర్ స్వర్ణ దేవాలయం పుష్కరిణిలో సుభాన్ రంగ్రేజ్ అనే ముస్లిం యువకుడు ‘‘వూజు’’ ((నమాజ్ చేసే ముందు కాళ్లు చేతులు కడుక్కుంటూ పులికిలించడం) చేయడం కలకలం రేపింది. దీంతో ఆ ముస్లిం యువకుడ్నిరెండో సారి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు.
 
నిజానికి జనవరి 24 న యూపీలోని ఘజియాబాద్ లో నిందితుడు సుభాన్ ఆచూకీ లభించింది. అక్కడే నిహంగ్ లు అతడ్ని పట్టుకొని, చెంపదెబ్బలు కొట్టి, పోలీసులకు అప్పగించారు., దీంతో దర్యాప్తు నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జనవరి 28 న కోర్టు మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్ కి అప్పగించింది. నిజానికి జనవరి 13న ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ‘‘స్వర్ణ దేవాయలంలోని పుష్కరిణిలో నీటితో నోరు పుక్కిలించి, ఆ నీటిని తిరిగి పవిత్రమైన పుష్కరిణిలోనే పారబోస్తూ, వూజు చేయడం కనిపించింది.
 
దీంతో సిక్కులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత అపవిత్రమైన చర్య అని మండిపడ్డారు.