ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ఇరాన్ మీడియా ధ్రువీకరణ

VSK Telangana    01-Mar-2026
Total Views |
 
khameni
 
కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ ను శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో మరణించారని ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది. ‘‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’’ పేరుతో శనివారం ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖమేనీ కార్యాయలం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారు. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
అయితే.. పక్కా సమాచారంతోనే అమెరికా ఖమేనీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. శనివారం ఖమేనీ తన కార్యాలయంలో కీలక సమావేశంలో వున్న సమయంలోనే దాడులు జరిగినట్లు అమెరికా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఆయనతో పాటు ఖమేనీ కుటుంబీకులైన కుమార్తె, అల్లుడు, మనుమరాలు కూడా ప్రాణాలు కోల్పోయారని కూడా ఇరాన్ మీడియా పేర్కొంది.
 
కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయిల్ శాటిలైట్ ద్వారా ఖమేనీని ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఖమేనీ ఆఫీసులో వున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత శనివారం ఉదయం 1:15 కి ఇరాన్ పై మిస్సైల్ దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కార్యాలయం సముదాయాలపై ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ఇజ్రాయిల్ ప్రయోగించగా.. తొమహక్ మిస్సైళ్లతో అమెరికా దాడికి దిగింది.