యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై దాడి కేసులో నిందితుడి ఎన్ కౌంటర్

VSK Telangana    02-Mar-2026
Total Views |
 
SALEEM
 
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన 'ఎక్స్-ముస్లిం' యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుల్లో ఒకడైన జీషన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
 
పోలీసు అధికారుల ప్రకారం పక్కా నిఘా సమాచారంతోనే పోలీసు బృందాలు షీజాహాన్ ను పట్టుకున్నారని, ఈ సమయంలోనే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో బుల్లెట్ గాయాలు అవ్వడంతో ఆస్పత్రికి తరలించగా.. కానీ... అప్పటికే మరణించాడు.
 
గత శుక్రవారం సలీమ్ తన కార్యాలయంలో ఉండగా బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కత్తితో దాడి చేశారు. సలీమ్ మెడ, పొట్ట భాగంలో దాదాపు 10 సార్లు పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
 
మరో వైపు వాస్తిక్ కుమాుడు ఉస్మాన్ గత నెల 27 న ఈ ఘటన పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిపై దాడి చేసిన వ్యక్తులు పదే పదే కత్తితో పోట్లు పొడిచాడని, తరువాత అక్కడి నుంచి పారిపోయారన్నారు. ఉస్మాన్ తన ఫిర్యాదులో కొంతమంది వ్యక్తుల ప్రమేయం గురించి అనుమానం వ్యక్తం చేశాడు. తన తండ్రిపై దాడిని నిర్వహించడంలో అఫాక్, మోను, నదీమ్ పాత్ర కూడా వుందని పేర్కొన్నాడు.