దిగొచ్చింది... క్షమాపణలు చెప్పిన హార్వర్డ్ యూనివర్సిటీ

VSK Telangana    02-Mar-2026
Total Views |
 
hu
 
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయన విభాగం దిగొచ్చింది. సంస్కృత భాషా కోర్సును ప్రోత్సహించడానికి ఓ పోస్టర్ ను రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టర్‌లో కృష్ణుడి చిత్రాన్ని చూపించిన తీరుపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా యూనివర్సిటీ అధికారులు పోస్టర్‌ను రూపొందించారని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.
 
 
దీనిపై స్పందించిన హార్వర్డ్‌లోని దక్షిణాసియా అధ్యయన విభాగం క్షమాపణలు చెప్పింది. సంస్కృత భాషా కార్యక్రమానికి సంబంధించిన అనుచిత పోస్టర్‌ను రూపొందించినందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. సంస్కృతాన్ని బోధించడంలో తమ విభాగానికి సుదీర్ఘ చరిత్ర ఉందని.. భాష, సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది