పంజాబ్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన వందేళ్ల ప్రయాణంలో దశ మారిందే గానీ దిశ మాత్రం ఎప్పుడూ మారలేదని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ లక్షణం కారణంగానే సమాజ విశ్వాసాన్ని సంఘ్ పొందుతోందన్నారు.సంఘ్ ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టడానికి వంద సంవత్సరాలు పట్టిందని, అయితే.. గత 20 సంవత్సరాలుగా క్రమ క్రమంగా సంఘ్ కి ప్రజల నుంచి మద్దతు విపరీతంగా పెరుగుతోందని ప్రకటించారు.
హర్యానాలోని అంబాలాలో "ట్రై-సిటీ యూత్ వాలంటీర్ గ్యాదరింగ్’’ అనే కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంసేవకులు అత్యంత వ్యతిరేక సమయంలోకూడా, చాలా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశారన్నారు.
సంఘ్ కార్యక్రమాలు నేడు విస్తృతంగా పెరుగుతున్నాయని, ఇది అత్యంత హర్షనీయమన్నారు. సమాజం యొక్క కరుణ, స్వయంసేవకుల కృషి ఫలితంగా ఇలా జరుగుతోందన్నారు. అయితే ఇప్పుడు మరింత జాగరూకతతో వ్యవహరించాలని, వంద సంవత్సరాలుగా ప్రత్యేక కార్య పద్ధతితో, సంప్రదాయాలతో సంఘ్ ను విస్తరించామని, ఇప్పుడు ప్రజలు విమర్శనాత్మక దృష్టికోణంతో చూస్తున్నారని అన్నారు.