ప్రజలంతా భక్తిభావంతో దేశంకోసం, ధర్మంకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు రాధామనోహర్ దాస్ స్వామీజీ. రాజుల దేవరప్పాడు గ్రామం మామూనూరు ఉపమండలం ఎర్రుపాలెం రెవెన్యూ మండలం మధిర ఖండ ఖమ్మం జిల్లాలో హిందూ సమ్మేళనం కార్యక్రమం మార్చి 20వ తేదీ, శుక్రవారం నాడు అత్యంత విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ రాధామనోహర్ దాస్ మాట్లాడతుూ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మనదేశం పేరుచెప్పగానే గంగామాత, భగవద్గీత, సీతామాత గుర్తుకురావాలని వారన్నారు.అందుకే మన ప్రధాని మోదీ సైతం ఏదేశం వెళ్లినా, వేరే ఏదేశ అధికారి మనదేశానికి వచ్చినా సరే భగవద్గీతను బహుమతిగా ఇస్తున్నారని వారన్నారు. హిందువులెప్పుడూ ఎవరి చెడునూ కోరుకోరనీ, దేశాన్ని ముక్కలు చేయరని పేర్కొన్నారు. కొనేటప్పుడు, తినేటప్పుడు ఎప్పుడైనా సరే మనధర్మానికి చెందినవారిదగ్గర తీసుకోవాలని, స్వదేశీని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు.
హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, కుల వివక్షకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, సనాతన ధర్మం పట్ల యువతలో చైతన్యం తీసుకురావడం ఈ సమ్మేళనాల ప్రధాన లక్ష్యం అని సంఘ శతాబ్ది సందర్భంగా దేశమంతటా ఈ హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారని ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ సహకార్యదర్శి అయిన సూరి శివరామకృష్ణ అన్నారు. సంఘం వ్యక్తి పూజ ఎన్నటికీ చేయదని, వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వదని పేర్కొంటూ దేశమే ముందు అని పేర్కొంటూ అందుకే సంఘ భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించిందనీ, సంఘ ప్రతీకార్యక్రమంలోనూ, శాఖలోనూ భగవాద్వజానికి నమస్కరించిన తర్వాతే కార్యక్రమ ప్రారంభం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తి కోలాటాలు, నాటకాలు, పాటలు, సాంప్రదాయ నృత్యాలు వంటి కార్యక్రమాలు అక్కడి విచ్చేసిన ప్రజలని ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాల నుండి 5,400 మందికి పైగా హిందువులు హాజరయ్యారు.