ప్రముఖ ఐవేర్ బ్రాండ్ ‘‘లెన్స్ కార్ట్’’ హిందూ సంప్రదాయాలను తీవ్రంగా అవమానపరిచింది. ఉద్యోగుల డ్రెస్ కోడ్ కి సంబంధించిన ఓ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిందువుల సంప్రదాయ చిహ్నాలైన బొట్టు, తిలకం, కంకణాలు ధరించడాన్ని లెన్స్ కార్ట్ సో్టర్ సిబ్బందికి నిషేధిాంచినట్లు, అదే సమయంలో హిజాబ్, టర్బన్ లకు అనుమతి ఇచ్చినట్లు అందులో వుంది.
ఇది కాస్త వైరల్ అవ్వడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పక్కా హిందువులను అవమానించడమే అని, హిందువుల పట్ల వివక్షను ప్రదర్శించడమే అని మండిపడ్డారు.లెన్స్ కార్ట్ కేవలం హిందూ సంప్రదాయాలపైనే ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల లెన్స్ కార్ట్ షోరూమ్ ల వద్ద నిరసనకారులు ఉద్యోగులకు తిలకాలు దిద్ది, తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఇక.. ఈ వివాదం పెరిగిపోవడంతో సీఈవో పీయూష్ బన్సాల్ స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో వున్న ఆ డాక్యుమెంట్ చాలా పాతదని, అది తప్పుడు సమాచారమని ప్రకటించారు. లెన్స్ కార్ట్ అన్ని మతాలను, సంప్రదాయాలను గౌరవిస్తుందని, దేనిపైనా నిషేధం లేదని స్పష్టతనిచ్చారు. ఉద్యోగులు తమ మతపరమైన విశ్వాసాలను పాటించే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.