సేవా భారతి ఆధ్వర్యంలో ‘‘కౌశలం సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్’’

VSK Telangana    21-Apr-2026
Total Views |
 
sewa
 
సేవా భారతి ఆధ్వర్యంలో ‘‘కౌశలం సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ (కుట్టు శిక్షణా కేంద్రం) ప్రారంభమైంది. ఈ నెల 19 న హైదరాబాద్ లోని సుభాష్ నగర్ శ్రీ గాయత్రి పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సమాజ అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాల్సిన అవసరం, దాని ప్రాముఖ్యతపై అతిథులు మాట్లాడారు.
 
ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలోనూ, సమాజాలను ఉన్నతీకరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు సేవా భారతి మూల బిందువులైన సంస్కారం, సమర్పణ, ఉపాధి, సేవను ప్రతిబింబిస్తోందని అన్నారు.
 
కుట్టుపని శిక్షణా కేంద్రం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం ద్వారా యువత, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతారన్న ధ్యేయంతో సేవా భారతి ఈ కేంద్రాన్ని ప్రారంభించింది.

sewa 
 
ఈ కార్యక్రమానికి RG Plastopack Pvt. Ltd. ఎండీ రామ్ గోపాల్ చౌదరి, Aparna Palm Meadows Seniors Group నుంచి సాయి కృష్ణ, ప్రాంత సేవా భారతి ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, భారత్ వికాస్ పరిషత్ జాయింట్ సెక్రెటరీ, శ్రీ గాయత్రి స్కూల్ గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర కృష్ణ, బోయినపల్లిభాగ్ సేవా భారతి అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సంభాగ్ సేవా ప్రముఖ్ మేకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.