భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవాలని, ఇది అందరి బాధ్యత అని శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు అన్నారు. బద్రుకా కాలేజీలో ‘‘భావదాస్య మూలాలు- ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన’’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవయుగ భారతి, ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి మాట్లాడుతూ కుల గణన సమాజాన్ని మరింత విభజిస్తుందని అన్నారు.ఆనాడు ఆంగ్లేయులు సమాజాన్ని విభజించడానికి కుల గణన చేపట్టారని అన్నారు. నేడు కేంద్రం చేపట్టే కుల గణన అవసరమే లేదని అన్నారు.