పెరుమాండ్ల గ్రామంలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి: ఉద్రిక్తత

VSK Telangana    28-May-2026
Total Views |
ముత్యాలమ్మ
 
తెలంగాణలోని మహబూబాబాద్ (మానుకోట) జిల్లా పరిధిలో డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామం, నిన్న అర్ధరాత్రి జరిగిన ముత్యాలమ్మ దేవాలయ దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది.
 
2026 మే 27న (బక్రీద్ పండుగ మరుసటి రోజుల్లో) అర్ధరాత్రి వేళ ఒక దుండగుడు పెరుమాండ్ల సంకీస గ్రామంలోని ముత్యాలమ్మ గుడిలోకి అక్రమంగా చొరబడ్డాడు. ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు.విగ్రహాన్ని ధ్వంసం చేసిన అనంతరం సదరు వ్యక్తి ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని ఉండగా, గమనించిన గ్రామస్థులు మరియు భక్తులు అతడిని పట్టుకున్నారు.
 
ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక భక్తులు, హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, చిన్న గ్రామీణ ఆలయాలకు కూడా భద్రత కరువైందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పేర్కొన్నారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న డోర్నకల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి, కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.