అగ్రిమెంట్ గడువు ముగిసినా..సిరాజుద్దీన్ దుకాణాన్ని ఖాళీ చేయడం లేదని హనుమకొండలోని కాకాజీ కాలనీలో ఓ మహిళ ఆందోళనకు దిగింది. ‘‘మా షాపును ఖాళీ చేయాలి’’ అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగింది. అంతేకాకుండా ఖాళీ చేయకుండా, తమపై దాడులు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని మంజుల అనే మహిళ ఆరోపించింది.
సిరాజుద్దీన్ అనే వ్యక్తికి 2020 లో తాము అద్దెకు ఇచ్చామని, 2025 మార్చి 30 కి అగ్రిమెంట్ ముగిసిపోయిందని చెప్పింది. సిరాజుద్దీన్ దగ్గరికి వెళ్లి, అగ్రిమెంట్ ముగిసిందని, ఖాళీ చేయాలని పదే పదే అడిగినా, ఖాళీ చేయడం లేదని పేర్కొంది.
తాము ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లామని, నోటీసులు కూడా ఇచ్చినా, స్పందించడం లేదన్నారు. ఇదేమిటని అడిగితే చంపేస్తానని పదే పదే బెదిరిస్తున్నారని మహిళ వాపోయింది. తాను ఇక్కడే వుంటానని, ఎక్కడకు వెళ్లి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని మహిళ పేర్కొంది. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, త్వరలోనే సీపీని కూడా కలుస్తానని చెప్పుకొచ్చారు.