గ్రామాన్నే సంఘమయం చేసిన ఏనుగందుల దయానంద్ కన్నుమూత

VSK Telangana    05-May-2026
Total Views |
 
dyaannd
 
ఇందూరు జిల్లా గుమ్మిర్యాల గ్రామానికి చెందిన జ్యేష్ఠ స్వయంసేవక్ ఏనుగందుల దయానంద్ సోమవారం తుదిశ్వాస విడిచారు. గుమ్మిర్యాల గ్రామమంతా స్వయంసేవకులను అంటే సంఘమయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.1980 నుంచి 2000 వరకూ పలుమార్లు నక్సలైట్లు దాడులు చేసినా, తన కళ్లముందే కార్యకర్తలను చంపేసినా, హింసలు పెట్టినా, దయానంద్ మాత్రం చలించలేదు. ఎన్ని ఆటంకాలు, హింసలు తలపెట్టినా, సంఘ కార్యాన్ని వదలకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో సంఘ కార్యాన్ని ముందుకే తీసుకెళ్లారు. సంఘ పనిలో నిరంతరం వుంటూ, ఇతర కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారు.
 
 
గుమ్మిర్యాల గ్రామంలో 1982 లో సంఘ శాఖలను ఆపేయాలని నక్సలైట్లు దాడి చేయడానికి వస్తే, వారి తుపాకులనే లాక్కొని, వారినే తరిమి తరిమి కొట్టడంలో దయానంద్ కీలక పాత్ర పోషించారు. దీంతో దాదాపు 10 సంవత్సరాల పాటు పోలీసులు సంఘ కార్యకర్తలకు డిపార్టుమెంటు వారి తుపాకులు ఇచ్చి, ఊరిని కాపాడమని చెప్పారు. అంటే ఆ గ్రామంలో సంఘ కార్యం ఎంత బలంగా నిర్మాణమైందో తెలుసుకోవచ్చు. దయానంద్ మృతిపై స్వయంసేవకులు శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ఈశ్వరుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.