బెంగాల్ లో రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు - పార్ట్ 1

VSK Telangana    06-May-2026
Total Views |
 
navami
 
బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో వున్న సమయంలో హిందువుల పరిస్థితి అధ్వాన్నంగా వుండేది. హిందువులు పండగలు జరుపుకోవాలన్నా, దుర్గా మండపాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతులు తీసుకోవాల్సిన అఘాయిత్యం ఏర్పడింది. మరీ ముఖ్యంగా 2009 నుంచి 2026 వరకు బెంగాల్ లో హిందూ పర్వదినాల సమయంలో అనేక దాడులు, హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటి గురించి వివరంగా చూద్దాం. ఈ మధ్య కాలంలో దాదాపు 27 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి.
 
బెంగాల్ లోని ముర్షిదాబాద్, హౌరా, హుగ్లీ, కలకత్తా బర్దమాన్, బీర్ భూమ్ తదితర ప్రాంతాల్లో రామన వమి, దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజ, హోళీ, దీపావళి, గణేష్ చతుర్థి వంటి పర్వదినాలలో వివాదాలు, హింసాత్మక ఘటనలు జరిగాయి.చాలో చోట్ల స్థానికులు, భక్తులు, హిందువులు గాయపడ్డారు. పోలీసులు కూడా గాయపడ్డారు. పలు చోట్ల దుకాణాలు, వాహనాలు, దుర్గా మండపాలు కూడా ధ్వంసమయ్యాయి.
 
27 మార్చి,2026
 
ప్రదేశం : ముర్షిదాబాద్ : రామ నవమి ఊరేగింపుపై మత ఛాందసుల రాళ్లదాడి. ఫుల్తలా కూడలి వద్ద జెండాలు ఎగురవేయడంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో, మత ఛాందసవాద ముస్లింలు ఊరేగింపుపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.
 
6 ఏప్రిల్, 2025
 
ప్రదేశం : కలకత్తా : పార్క్ సర్కస్ ప్రాంతంలో రామ నవమి సందర్భంగా జరుగుతున్న ఊరేగింపుపై ముస్లిం ముకల దాడి, పలు వాహనాలు ధ్వంసం. వాహనాలపై కూడా దాడికి దిగారు.
 
17 ఏప్రిల్, 2024
 
స్థలం : ముర్షిదాబాద్
 
శక్తిపూర్ లో రామ నవమి సందర్భంగా జరుగుతున్న ఊరేగింపుపై మత ఛాందసులు రాళ్లు రువ్వారు, బాంబులను విసిరారు. దీంతో 20 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని పలు ఇళ్లపై, దుకాణాలపై కూడా మూక దాడి చేసింది, నిప్పు పెట్టి, దోపిడీ చేశారు.
 
17 ఏప్రిల్, 2024
 
స్థలం : మోదీనీ పూర్, బెంగాల్
 
ఎగ్రా అనే ప్రాంతంలో నవమి ఊరేగింపు సందర్భంగా అల్లరి మూకలు దాడికి దిగారు. ఈ హింసాకాండలో ఇద్దరు మైనర్లు, ఒక మహిళ మరియు పలువురు పోలీసు సిబ్బందితో సహా 18 మందికి పైగా గాయపడ్డారు.
 
2 ఏప్రిల్, 2023
 
స్థలం : హుగ్లీ
 
బీజేపీ ఆధ్వర్యంలో రామ నవమి ఊరేగింపు జరిగింది. రిష్రా ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా ఊరేగింపుపై రాళ్లదాడి జరిగింది. అల్లరి మూకలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
 
20 మార్చి, 2023
 
స్థలం : హవడా, బెంగాల్
 
హౌరాలోని శిబ్‌పూర్‌లో హింసాకాండ చెలరేగింది. ముస్లింలు రామ నవమి ఊరేగింపుపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో సంబంధమున్న 36 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 15 మంది పోలీసులు గాయపడ్డారు. మూకలు 10 వాహనాలను, 20 దుకాణాలను ధ్వంసం చేశారు.
 
10 ఏప్రిల్, 2022
 
హవడా, బెంగాల్
 
నవమి ఊరేగింపు సందర్భంగా ఫాజిర్ బజార్ వద్ద హిందువులపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. పలు దుకాణాలకు నిప్పు పెట్టారు. పోలీసులు లాఠీ ఛార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు.
 
25 మార్చి, 2018
 
వర్ధమాన్, బెంగాల్
 
అసన్ సోల్ లోని శాటిలైట్ టౌన్ షిప్ ప్రాంతంలో జరుగుతున్న నవమి ఊరేగింపుపై ముస్లిం మూక రాళ్లదాడికి దిగింది. ఇందులో ఓ హిందువు మరణించగా, ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. 18 మందిని అరెస్ట్ చేశారు.
 
5 ఏప్రిల్, 2017
హవడా, బెంగాల్
 
శిబ్ పూర్ లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు నవమి పోస్టర్లను చింపేశారు. దీంతో బీజేపీకి, టీఎంసీ కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. టీఎంసీ నేతలు గాజు సీసాలతో దాడి చేశారు.