మునంబం తర్వాత కన్నూర్ పై కన్నేసిన వక్ఫ్ బోర్డు

VSK Telangana    12-Jun-2026
Total Views |
 
kerala
 
కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు యాక్టివ్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్నాకుళం జిల్లాలోని మునంబం భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇప్పుడు కన్నూర్ జిల్లాలోని తాలిపరంబలో ఉన్న 634 ఎకరాల భూమిని అది లక్ష్యంగా చేసుకుంది.తలిపరంబలోని 634 ఎకరాల విస్తీర్ణంలో మున్సిపల్ కార్యాలయం, వాణిజ్య భవనాలతో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థల భవనాలు కూడా వున్నట్లు తెలుస్తోంది.
 
అయితే.. ప్రైవేట్ వ్యక్తుు ఆక్రమించుకున్నారని లేదా తమ ఆధీనంలో వుంచుకున్నారని ఆరోపణలున్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను సేకరించే పనిని వక్ఫ్ బోర్డు ప్రారంభించింది. ఈ భూములను పరిశీలించడానికి, వక్ఫ్ భూములని నిర్ధారించుకోవడానికి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఓ ప్రతినిధి బృందం త్వరలోనే తలిపరంబలో పర్యటించనుంది.
 
మొత్తం 634 ఎకరాల భూమిలో, తాలిపరంబ జమాత్ ట్రస్ట్ ముత్తవల్లి సుమారు 400 ఎకరాలను UMEED పోర్టల్‌లో నమోదు చేశారు. మిగిలిన భూమికి సంబంధించిన పత్రాల కోసం వారు అన్వేషిస్తున్నారు.ఆ భూమిలో గణనీయమైన భాగం ఇప్పటికీ మొదటి 'తలిపరంబ జమాత్ ట్రస్ట్'కు చెందిన వారి బంధువుల ఆధీనంలోనే ఉందని బోర్డు ఆరోపించింది.
 
'మన్నా' (Manna) ప్రాంతంలోని వందలాది ఎకరాల వక్ఫ్ భూమిని తాలిపరంబ జమాత్ ట్రస్ట్ యొక్క మొదటి ముత్తవల్లి (Muttavalli) బంధువులకు పంపిణీ చేశారని ఒక అధికారి పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారం ఇలా వుండగా.. కాంగ్రెస్ గానీ, లెఫ్ట్ గానీ తమ లౌకిక నిబద్ధతను నిరూపించుకోవడానికి తమకే పూర్తి మద్దతిస్తాయని వక్ఫ్ బోర్డు భరోసాతో వుందని విమర్శకులు వాదిస్తున్నారు.
 
source : organiser