ఆరెస్సెస్ ఆదర్శాలను ఎంతగానో ఆరాధిస్తా : మమతా శంకర్

VSK Telangana    03-Jun-2026
Total Views |
 
rss
 
తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేసే కృషిని, వారి ఆదర్శాలను ఎంతగానో ఆరాధిస్తానని ప్రముఖ నర్తకి, నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత మమతా శంకర్ తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ బెంగాల్ ప్రాంత సంఘ శిక్షా వర్గ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. అయితే... మీడియా దీనిపై ఆమెను అడిగింది. నిజంగానే మీరు ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరయ్యారా? అని అడగ్గా.. ‘‘అవును హాజరయ్యాను’’ అని ప్రకటించారు.
 
‘‘అవును నేను హాజరయ్యాను. ఆరెస్సెస్ చేసే కృషి, ఆదర్శాలను నేను ఎంతగానో ఆరాధిస్తాను. భారత దేశానికి సంఘ్ అత్యంత ఆవశ్యకమని నేను భావిస్తాను. అందుకే నేను సంఘ్ కార్యక్రమానికి వెళ్లాను.స్వయంసేవకులు పాటించే క్రమశిక్షణ నన్నెంతో ఆకర్షిస్తుంది. అభినందిస్తాను కూడా. గతంలోనూ సంఘ్ కార్యక్రమాలను నేను హాజరయ్యాను. ఇప్పుడు కూడా హాజరయ్యా’’ అని వివరించారు.
 
అలాగే నూతనంగా బెంగాల్ లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై తానెంతో ఆశావాదంతో వున్నానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పనులు, వాటి తీరు తెన్నులు నచ్చాయన్నారు.దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ప్రకటించారు.
 
భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని పరిరక్షించే క్రమంలోనే మీరు సంఘ్, బీజేపీకి మద్దతిస్తున్నారా? అని అడగ్గా.. అవునని మమతా శంకర్ బదులిచ్చారు.‘‘ఖచ్చితంగా. నేను ఈ విషయాన్ని చాలా బలంగా చెబుతాను. వారు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు.భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు వాటికి దక్కాల్సిన సముచిత స్థానాన్ని తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచ వేదికపై భారతదేశం అత్యున్నత స్థానాన్నితిరిగి పొందుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. నా స్వప్నం కూడా అదే.ప్రపంచం మన దేశం వైపు చూస్తోంది. ఇతర దేశాలు మన సంస్కృతిని, ఆధ్యాత్మికతను మరియు మనలోని అనేక సానుకూల విలువలను స్వీకరించడానికి ప్రయత్నిస్తుండగా, మనం మాత్రం వారి ప్రతికూల అంశాలను స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాము.’’ అని అన్నారు.
 
సౌజన్యం - Organiser