ఏబీవీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

VSK Telangana    08-Jun-2026
Total Views |
 
ఏబీవీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన
 
తెలంగాణలో సభ్యత్వ నమోదు వర్క్ షాప్‌కి ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) శ్రీకారం చుట్టింది. తెలంగాణ నలుమూలల నుండి వచ్చిన 300 మంది ముఖ్యమైన కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ విచ్చేసి విద్యార్థులకు ఏబీవీపీ సభ్యత్వాన్ని అందించారు.  ఈ సందర్భంగా రావుల కృష్ణ మాట్లాడుతూ "ఏబీవీపీ అంటే నాలుగు అక్షరాలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడు. అనునిత్యం విద్యార్థి సమస్యల పైన, విద్యార్థి కష్టసుఖాలలో, చిట్టచివరి విద్యార్థికి కూడా నాణ్యమైన చదువు, విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తూ... 'నేటి విద్యార్థి - నేటి పౌరుడే' అనే నినాదంతో వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే మహాయజ్ఞ కార్యాన్ని నిర్మిస్తున్నది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)" అని స్పష్టం చేశారు.
 
ABVP స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో గాని, దేశంలో గాని, ప్రపంచంలో గాని నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌గా నిలిచిందని రావుల కృష్ణ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆనగా 2026-27లో 10,00,000 సభ్యత్వాల సాధన... పట్టణాల నుండి మండలాల వరకు వెళ్లి చిట్టచివరి విద్యార్థి వరకు సభ్యులను చేయడం వంటి భారీ లక్ష్యాలతో ఏబీవీపీ ముందుకు వెళుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ సంఘటన మంత్రి రాజశేఖర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మలబిక, కార్యదర్శి పృథ్వి, జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్, హర్ష, సంయుక్త కార్యదర్శులు మహేష్, రాజు, దీపికా, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు, విభాగ్ కన్వీనర్లు, జిల్లా కన్వీనర్లు, టౌన్ సెక్రటరీస్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ముఖ్యమైన కార్యకర్తలు పాల్గొన్నారు.