‘‘కల్మా’’ కంఠస్థం చేయాలి.. ప్రైవేట్ పాఠశాల హిందూ విద్యార్థికి హోంవర్క్

VSK Telangana    16-Jul-2026
Total Views |
hw
 
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలోని ‘‘ది సక్సెస్ స్కూల్’’అనే ప్రైవేట్ పాఠశాలలో వివాదం రేగింది. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థిని హోం వర్క్‌లో భాగంగా ‘‘కల్మా’’ నేర్చుకొని, పఠించాలని షేక్ ఆయిషా పర్వీన్ అనే టీచర్ సూచించారు. ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసి పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పై హిందూ సంఘాలకు కూడా సమాచారం అందడంతో ‘‘ది సక్సెస్ స్కూల్’’ తీరును నిరసించారు.
 
కుటుంబీకుల సమాచారం ప్రకారం తరగతి గది ఉపాధ్యాయురాలు తమ బిడ్డకి కల్మాను కంఠస్థం చేసి, వినిపించాలని హోంవర్క్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ అసైన్‌మెంట్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు, వెంటనే పాఠశాలకు వెళ్లి అధికారుల నుంచి వివరణ కోరారు. ఇది ఒకే ఒక్కసారి మాత్రమే జరిగిన ఘటన కాదని, తమ బిడ్డకు గతంలో కూడా ఇలాంటి హోంవర్క్ ఇచ్చారని వారు ఆరోపించారు.
 
ఈ సంఘటన ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని, పాఠశాల యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్య శాఖకి కంప్లైట్ ఇచ్చింది కుటుంబం. అసలు కల్మా కంఠస్థం చేయమని హోం వర్క్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయురాలు షేక్ ఆయిషా పర్వీన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ‘‘ది సక్సెస్ స్కూల్’’ యాజమాన్యం ప్రకటించింది.
 

Success School