భాగ్యనగర్‌లో డేరింగ్ హిందూ ఆటో డ్రైవర్‌కు VHP జాతీయ నేత అండ

VSK Telangana    16-Jul-2026
Total Views |
SURENDRA JIAN
 
భాగ్యనగర్‌లోని అత్తాపూర్‌లో భరత్ కుమార్ అనే ఆటో డ్రైవర్ పై జరిగిన దాడి ఘటనపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని VHP జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ తీవ్రంగా ఖండించారు. తన ఆటోపై ‘హిందూ మతం పట్ల ఆత్మగౌరవం' అనే పిలుపుతో కూడిన నినాదం రాసుకున్నందుకు గాను కొందరు ఇస్లామిక్ ఛాందసవాదులు అతనిపై దాడికి తెగబడటం అత్యంత హేయమైన చర్య అని ఎక్స్ వేదికగా స్పందించారు.
 
"సొంత మతం పట్ల జాగరూకతతో ఉండాలని రాసుకోవడం నేరమా? ముస్లింలు తమ మాటలు, వేషధారణ, జీవనశైలి ద్వారా 24 గంటలూ ఇస్లాంను ప్రచారం చేస్తూనే ఉంటారు. మరి దీని కోసం ఏ హిందువైనా వారిని అడ్డుకున్నారా? లేక వారిపై భౌతిక దాడులు చేశారా?" అని నిలదీశారు.
హిందూ సమాజానికి పిలుపునిస్తూ.. ప్రతి హిందువు తమ తోటి స్వధర్మీయుల ఆటోలలో లేదా టాక్సీలలోనే ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఆర్థిక స్వావలంబన కోసం మరియు మనవారి రక్షణ కోసం స్వధర్మీయుల ప్రజలతోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

 
 
అసలు ఏం జరిగిందంటే...
 
భరత్ కుమార్ తన ఆటో వెనుక ‘‘ఈ భూమ్మీద పుట్టిన ఎవరైనా హిందువులే.. జైశ్రీరామ్.. నీ మతాన్ని మార్చుకోవడమనేది తండ్రిని మార్చుకోవడం లాంటిది’’(Changing your religion is like changing your father.. Anyone born on this earth is a Hindu... Jai Sriram) అని అర్థం వచ్చేలా తన ఆటో వెనకాల రాసుకున్నాడు. ఈ ఘటన జరిగింది హైదరాబాదులోని అత్తాపూర్ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో ఈ ఆటోను ఆపి వుంచిన సమంయలో స్థానికులు ఆ కొటేషన్లను గమనించి, భరత్ ను ప్రశ్నించారు. ‘‘అలాంటి పదాలు వాడొద్దు... ఇక్కడ మత సామరస్యంతో జీవిస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 AUTO
 
దీనికి భరత్ సూటిగా, తడుముకోకుండా జవాబిచ్చాడు. ‘‘ఇది నా ఆటో.. నా ఇష్టం, మీకు ఏమి ఇబ్బంది? అంటూ ప్రశ్నించారు. దీంతో కొందరు ఛాందసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడి వివరాలు తెలుసుకున్నారు. పీఎస్‌కి రావాలని సూచించారు. పోలీసులకు కూడా అత్యంత ధర్మబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగానే సమాధానమిచ్చాడు. చాలామంది జాతీయవాదులు ఆటోవాలా భరత్‌కి మద్దతుగా నిలుస్తున్నారు.
 
ఓ ఆటో డ్రైవర్ తన సొంత ఆటోపై తన మతాన్ని సమర్థిస్తూ రాసుకోవడం తప్పా? రాజ్యాంగంలో వుందా? అంటూ హిందువులు ప్రశ్నిస్తున్నారు.‘‘ధర్మ వీరుడు ఈ ఆటో డ్రైవర్. హిందూ యువతకు స్ఫూర్తిదాత భరత్, నిఖార్సైన హిందూ ఆటో డ్రైవర్ భరత్’’ అని వేనోళ్ల పొగుడుతున్నారు.
 

Auto Driver Bharat 
 
మరో వైపు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కూడా ఆటో డ్రైవర్ భరత్‌కి మద్దతుగా రంగంలోకి దిగారు. అతడికి న్యాయం జరిగేలా చూస్తామని, అతనికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.దీంతో పాటు ఛాందసులను, పోలీసులను కూడా తట్టుకొని నిలబడ్డ భరత్‌కి హిందూ సంఘాలు ఘనమైన సత్కారం చేశాయి.
 
ఈ ఘటనపై VHP జాతీయ అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్ స్పందించారు. "ఆటో డ్రైవర్, రియల్ హీరో, సోదరుడు భరత్‌కు అండగా ఉంటాము. ఏం జరుగుతుందో చూద్దాం! ఈరోజు VHP రాష్ట్ర కార్యాలయంలో భరత్ కలిసాడు, కలిసి భోజనం చేశాము. ఇకపై భాగ్యనగరంలో ప్రతి ఆటో 'జై శ్రీరామ్' అని నినదిస్తుంది, ఆటో చక్రాలే భాగ్యనగరంలో జగన్నాథ రథచక్రాలై కదులుతాయి!’’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.