చేసేవన్నీ రౌడీషీటర్ పనులు. పోలీసులకు కూడా తెలిసిపోయింది. దీంతో పోలీసులకు తెలియకుండా ఓ రౌడీ షీటర్ కాస్త బాబా అవతారం ఎత్తేశాడు. మకాం కూడా మార్చేశాడు. మహ్మద్ షేక్ జావేద్ పెయింటింగ్ పనులు చేసేవాడు. అయితే అతనిపై పీఎస్ లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సైఫాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడు ఈ జావెద్.
దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా బాబా అవతారమే ఎత్తేశాడు జావేద్.భార్యతో గొడవపడి ఒంటరిగానే వుంటున్నాడు. హత్య కేసులో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత యేడాది జూన్ నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఎవరూ గుర్తించవద్దని సంగారెడ్డి జిల్లాలోని వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు.
అక్కడ పెరోంకి మసీదును అడ్డాగా మార్చేసుకున్నాడు. బురిడీ బాబా వేషం వేసి, అందర్నీ నమ్మబలికాడు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తానంటూ తెగ నమ్మించేశాడు. అంతేకాకుండా భక్తులు ఫోటోలు కూడా దిగేవారు. ఇంతలో టాస్క్ ఫోర్స్ బురిడీ బాబా అవతారాన్ని పసిగట్టేసింది.ఫూల్ బాగ్ వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. జావేద్ నుంచి కొంత గంజాయి, పీర్ బాబా దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.