అమాయకుల్నే బలిపీఠం మీద పెడుతున్నారు.. గుంట నక్కలతో జాగ్రత్త

VSK Telangana    21-Jul-2026
Total Views |
 
chada
 
- చాడా శాస్త్రి 
 
CJP అనేది 16 మే 2026న అభిజీత్ డిప్కే ప్రారంభించిన ఒక హాస్యాస్పద లేదా వ్యంగ్య రాజకీయ ఆన్ లైన్ ఉద్యమం.
 
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ఒక కేసులో కొందరు నిరుద్యోగ యువతను "కాక్రోచ్‌లు", "పరాన్నభుక్కులు" అని వ్యాఖ్యానించినందున ఆ పదాన్ని పట్టుకుని సోషల్ మీడియా ఉద్యమం ప్రారంభమైంది. తర్వాత NEET-UG 2026 పేపర్ లీక్, పరీక్షా అవకతవకలు, విద్యార్థి ఆత్మహత్యలు వంటి సమస్యలపై దృష్టి సారించి, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షా సంస్కరణలు, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం వంటి డిమాండ్లతో ఉద్యమం ముందుకు సాగింది.
 
CJP ముఖ్య నేతలు అభిజీత్ డిప్కే దీని స్థాపకుడు, అధ్యక్షుడు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతూ, ముందు AAP సోషల్ మీడియాలో వర్క్ చేసిన వ్యక్తి.
 
సౌరవ్ దాస్ చీఫ్ స్పోక్స్‌పర్సన్ -ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్?
 
విజేత దహియా: మరో స్పోక్స్‌పర్సన్ రాజకీయ పరిశోధకుడు, రచయిత, మినీ ఫిల్మ్‌మేకర్.
 
మరో స్పోక్స్‌పర్సన్: అశుతోష్ రాంకా.
 
ఈ నేతలు ఉద్యమాన్ని డిజిటల్ నుంచి గ్రౌండ్‌లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
 
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జూన్ 20న ఒకరోజు ధర్నా నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని అంటే పోలీసులు అనుమతి ఇచ్చి సాయంత్రం 5గం. లకు అక్కడ ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని చెప్పారు. కానీ, పోలీసుల ఆదేశాలు ఖాతరు చేయకుండా నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు నెల రోజులు ధర్నా నిర్వహిస్తూ మధ్యలో లాడక్ కి చెందిన సోనమ్ వాంగ్ చుక్ చేత నిరాహారదీక్ష కూడా చేయించారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా పోలీసులు ఏఒక్క రోజూ దౌర్జన్యం చేసి వారిని చెదరగొట్ట కుండా మౌనంగా ఉన్నారు.
 
వాంగ్ చుక్ ని నిరాహారదీక్ష కు కూర్చోబెట్టి వీళ్ళందరూ 24 గం. లు ఫుడ్ ఫెస్టివల్ గానా బజానాలలో ములిగిపోవడం తో వాంగ్ చుక్ ఈ తిండి గోల నాకు ఇబ్బంది గా ఉంది దాన్ని ఆపి మీరు కూడా నిరాహారదీక్ష లో పాల్గొనండి అని చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదు.
 
ఈలోగా వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణీస్తోంది ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అని ఆయన అనుచరులు ఢిల్లీ హై కోర్ట్ ని కోరితే, ఆయన్ను వెంటనే హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని కౌర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఆయన్ని 18న హాస్పిటల్ లో పెట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. నిర్వహకుల ధోరణి ఆయనకు కూడా నచ్చినట్లు లేదు పెద్దగా ప్రతిఘటించకుండా పోలీసులు వెంట ఆసుపత్రికి వెళ్లిపోయారు. వాంగ్ చుక్ ని స్టేజ్ మీద నుండి తరలించే సమయంలో CJP ముఖ్య నేతలు ఎవరూ ఆయన వద్ద లేదు ఎక్కడో 5స్టార్ హోటల్లో నిద్ర పోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
 
CJP నిర్వాహకులు నిన్న అంటే జులై 20న "చలో సంసద్" (పార్లమెంటు మార్చ్) పిలుపునిచ్చారు. వేల మంది జంతర్ మంతర్ వద్ద హాజరు అయ్యారు.
 
ఢిల్లీ పోలీస్ ముందుగానే సెక్షన్ 163క్రింద నిషేధాజ్ఞలు విధించి, మార్చ్‌కు అనుమతి ఇవ్వలేదు.
 
అసలు ర్యాలీ ని శాంతియుతంగా నిర్వహిస్తాం అని చెప్పి లీడ్ చేయవలసిన CJP ముఖ్య నేతలలో అభిజిత్ మాత్రమే అదీ కొద్ది సమయం మాత్రమే ర్యాలీ లో పాల్గొని వెళ్ళిపోతే, ఇతర ముఖ్య నేతలు సౌరవ్ దాస్, విజేత దహియా మరియు అశుతోష్ రంకా అసలు అక్కడకు రానే లేదు.దాంతో వచ్చిన జనాలను లీడ్ చేసే నేతలు లేక వచ్చిన జనాలు దౌర్జన్యం గా పోలీసు బ్యారికేడ్లు దాటి పార్లమెంటు వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.
 
కొంతమంది ప్రదర్శనకారులు రాళ్లు విసిరినట్లు పోలీసులపై, బస్సులపై ముందుగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. దాంతో పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ వాడి అల్లరి మూకలు పార్లమెంట్ వరకు రాకుండా అడ్డుకుని జనాలను వెళ్లగొట్టారు.
 
50 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారని, కొన్ని పోలీసు బస్సులు దెబ్బతిన్నాయి అని, జన్‌పథ్ వద్ద కొన్ని దుకాణాలు దెబ్బతిన్నట్లు వీడియోలు వచ్చాయి. 70మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు.
 
రాత్రి పొద్దుపోయాక CJP స్పోక్స్‌పర్సన్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా యూనియన్ మంత్రి JP నడ్డాను కలిసి వాంగ్ చుక్ ని హాస్పిటల్ నుండి విడుదల చేయాలని, ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అనే కోరికలతో వినతి పత్రం ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్దిష్ట హామీలు ఇచ్చినట్లు గా ఎక్కడ వార్తలు లేవు. పార్లమెంటులో కూడా విపక్షాలు ఈ సమస్య మీద అడ్జర్న్‌మెంట్లు చేశాయి.
 
ఇది నిన్నటి వరకు కధ.
 
ఈ ఉద్యమం నిజంగా అసలు విద్యార్థులు ఉద్యమమా? లేక వేరే వేరే గ్రూపులు వేరే వేరే అజెండాలతో వచ్చి ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసి అసలు సమస్యను వెనక్కి నెట్టేసారా?
 
అసలు ఎజెండా ఏమిటి? ఉద్యమం ఎందుకు విఫలం అయింది? ఈ ప్రశ్నలకు జవాబులతో మరో పోస్ట్ పెడతాను.
ఈ లోగా పై ప్రశ్నలపై మీ అభిప్రాయాలను తెలియచేయండి.
 
గత ఉద్యమాల సమయంలో లాగా మేం శాంతియుతంగా చేస్తూ ఉంటే పోలీసులే ముందు లాఠీ ఛార్జ్ చేయడం వల్ల ఆందోళన కారులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు అని తప్పించుకోవడానికి ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో కుదరదు. ప్రతీ చిన్న సంఘటన మొబైల్ ఫోన్స్, యూ ట్యూబ్ ఛానల్స్ కెమెరాలతో రికార్డ్ అయిపోతున్నాయి. కోర్టుల్లో ఋజువు లు కోసం ఇటువంటి సమయాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగిస్తూ కేసులు పెడుతున్నారు. అందుకే CAA ఆందోళనలు, రైతు ఉద్యమం సమయంలో కొన్ని వందల మంది ఇప్పటికి కోర్ట్ కేసులు ఎదుర్కొంటూ ఇరుక్కున్నారు.
 
నిన్న ఎంత బుర్రలేని వెధవలు వచ్చారు అంటే పోలీసు జీపులను కార్లను ధ్వంసం చేసి వాటిలో ఉన్న బులెట్ ప్రూఫ్ జాకెట్లను, హెల్మెట్లు ను దోచుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు సొషల్ మీడియా లో వీడియోలు వచ్చాయి.
 
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ఒక కేసులో కొందరు యువతను "కాక్రోచ్‌లు", "పరాన్నభుక్కులు" అని వ్యాఖ్యానించినది నిజమే అని గత నెల రోజుల సంఘటనలు రుజువు చేశాయి. ఈ ఉద్యమం లో అసలైన బాధిత విద్యార్థులు/యువత 1% ఉంటే CJI గారు చెప్పిన మిగతా వారు 99% ఉన్నారు.
 
చివరగా....ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించి వీరిని రెచ్చగొట్టిన వామపక్ష మేధావులు కానీ JNU/ DU ప్రొఫెసర్స్ కానీ వారి పిల్లలను ఇటువంటి ఆందోళనలకు దూరంగా ఉంచి అమాయక యువతను మాత్రం బలి పీఠం మీద పెడతారు. నిన్న ఆ ప్రొఫెసర్లు లేదా ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు వచ్చి లీడ్ చేయవచ్చు కదా!.అబ్బే వచ్చి ఆ రిస్క్ తీసుకోరు.
 
అటువంటి గుంటనక్కలతో జాగ్రత్త!