అహ్మదాబాద్ వరుస పేలుళ్లు : 38 మందికి మరణ శిక్ష

VSK Telangana    07-Jul-2026
Total Views |
 
bomb
 
అహ్మదాబాద్ లో 2008 నాటి వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 38 మందికి మరణ శిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ 2022 లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
 
అయితే.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5లక్షల పరిహారం ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31,2027 లోగా ఈ పరిహార చెల్లింపులు పూర్తి చేసేయాలని హైకోర్టు ఆదేశించింది.
 
ఈ కేసులో మొత్తం 77 మంది నిందితుల్లో 28 మందిని ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి ఎ.ఆర్. పటేల్ గతంలోనే నిర్దోషులుగా విడుదల చేశారు. శిక్షలతో పాటు, బాధితులకు మరియు వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 50,000 మరియు స్వల్ప గాయాలైన వారికి రూ. 25,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, దోషులుగా తేలిన ప్రతి ఒక్కరికీ రూ. 2.85 లక్షల జరిమానాను కూడా న్యాయస్థానం విధించింది.
 
మరణ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ వారి వివరాలు...
 
Zahid Sheikh
Imran Sheikh
Iqbal Sheikh
Samsuddin Sheikh
Javed Sheikh
Asif Sheikh
Atique Khiljee
Mehdi Ansari
Safiq Ansari
Rafiuddin
Arif Mirza
Kabumuddin
Sibyl Muslim
Safdar Nagori
Hafiz Mulla
Sajid Mansoori
Afzal Usmani
Sarfuddin Itti
Md. Sadiq Sheikh
Md. Arif Sheikh
Akbar Chaudhary
Fazal Durani
Nausad Sayed
Ahmed Barelvi
Rafiq Afidi
Amin Sheikh
Md. Mobin Khan
Md. Ansar
Gyasuddin Ansari
Arif Kagzi
Usmaan
Yunus Mansoori
Imran Pathan
Abubasar Sheikh
Abaas Sameza
Saifu Ansari
Md. Saif Sheikh
Zishan Sheikh
Jia-ur-Rahman
Tanveer Pathan
Abraar Maniyar
Shaduli Karim
Tausif Pathan
Md. Ali Ansari
Md. Ismail
Kamruddin
Aleem Kazi
Aniq Sayed
Md. Shaqil
 
2022 లో ప్రత్యేక న్యాయ స్థానం ఇచ్చిన తీర్పులో 49 మందిని దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అప్రూవర్ గా మారిన ఓ నిందితుడికి క్షమాభిక్ష కూడా ప్రసాదించింది.