CRPF ఆధ్వర్యంలో జమ్మూ కశ్మీర్ లో ‘‘తిరంగా ర్యాలీ’’

VSK Telangana    12-Aug-2026
Total Views |
 
jk
 
‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమ స్ఫూర్తిని, స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తదిని పెంపొందించడానికి జమ్మూ కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 11 న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, లాల్ చౌక్‌లో ఉన్న చారిత్రక 'ఘంటా ఘర్' వద్ద పాఠశాల విద్యార్థులతో కలిసి 'తిరంగా ర్యాలీ'ని నిర్వహించింది.
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీరులకు నివాళులర్పిస్తూ, విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని, ర్యాలీలో CRPF సిబ్బందితో కలిసి నడిచారు.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వార్షిక 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు శ్రీనగర్‌లోని CRPF 132వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రహ్లాద్ సింగ్ తెలిపారు.
75 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక నుంచి ప్రతి యేటా హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించాలని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం మరియు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, అలాగే దేశానికి తమవంతు సహకారం అందించేలా వారిని ప్రేరేపించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమం నేపథ్యంలో తాము సమీపంలోని పాఠశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులే మన భవిష్యత్తు, వారే దేశాన్ని ముందుకు తీసుకువెళతారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, స్వాతంత్ర్య పోరాటం మరియు స్వాతంత్ర్య సమరయోధుల గురించి వారికి అవగాహన కల్పించడం, తద్వారా వారు వారి త్యాగాల నుండి స్ఫూర్తి పొంది, దేశానికి సేవ చేయాలనే తపనను పెంపొందించుకోవడం" అని సింగ్ తెలిపారు.
 
మరో వైపు ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలను, అలాగే దేశ రక్షణలో సాయుధ దళాలు, భద్రతా సిబ్బంది అందించిన సేవలను తాము అర్థం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రతి ఇంట్లోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకోవాలని, అలాగే దేశ భద్రతా దళాల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలని మరో విద్యార్థి అన్నారు.