అక్రమ చొరబాట్ల అంశం రాజకీయ అంశమే కాదు : భరత్ కుమార్

VSK Telangana    13-Aug-2026
Total Views |
 
bharath ji
 
అక్రమ చొరబాటును కేవలం ఎన్నికల లేదా రాజకీయ అంశంగా మాత్రమే చూడకూడదని, ఇది దేశ భద్రత, జనాభా సమతుల్యత మరియు భారతదేశ సాంస్కృతిక, సామాజిక స్వరూప పరిరక్షణకు సంబంధించిన అంశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ అన్నారు.
 
ఈ నెల 12 న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, పిజిఆర్‌ఆర్‌సిడిఇ ఆడిటోరియంలో  20వ జనమంచి గౌరీ శంకర్ స్మారక ఉపన్యాసం ‘‘అక్రమ చొరబాట్ల ప్రభావం’’ పై భరత్ కుమార్ ప్రసంగించారు. అక్రమ చొరబాట్ల విషయంలో  రాజకీయ విషయాలను పరిగణనలోకి తీసుకోవద్దని, కేవలం జాతీయ ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
 
లౌకికవాదం గురించి మాట్లాడుతూ  హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం భారతదేశం లౌకికంగానే ఉంటుందని, ఎందుకంటే జనాభా స్వరూపాన్ని మార్చే ఎజెండాతో భారతదేశంలోకి చొరబడే చొరబాటుదారులు, భారత్  అసలైన సాంస్కృతిక మూలాల నుండి దాని గుర్తింపునే మార్చడానికి ప్రయత్నిస్తారని ఆరోపించారు.

bharath ji2 
ప్రజలు ఈ దుష్ట ప్రణాళికను, దానిని అమలుచేసేవారిని అర్థం చేసుకోవాలని, హిందువులందరి సమిష్టి బాధ్యతతో వారి చర్యలను, కుట్రలను ఎదుర్కోవడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ పాకిస్థాన్‌లో ఇస్లామిక్ పాలనలో జోగేంద్రనాథ్ మండల్‌కు పట్టిన గతిని, అలాగే హిందువులపై జరిగిన లెక్కలేనన్ని అఘాయిత్యాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
 
పరాయి దేశంలోని పరిస్థితుల కారణంగా శరణుగోరి ఈ దేశానికి వస్తే ఆశ్రయమిచ్చి అక్కడి పరిస్థితులు మారిన తర్వాత తిరిగి పంపేవారు వారిని శరణార్థులు అంటారు, కానీ ప్రస్తుతం అక్రమంగా ఈ దేశంలోకి చొరబడి వారి సంఖ్యను పెంచుకొని అరాచకాన్ని సృష్టించాలనుకోవడం తప్పు అని అన్నారు.
 
1947 స్వతంత్రానంతరం బ్రిటిష్ వారికి దేశం ముక్కలైన సంతృప్తి,కాంగ్రెస్ కి అధికార సంతృప్తి ,ముస్లింలీగ్ కి పాకిస్తాన్ వచ్చిందని, ,కానీ భరతమాతకు తన పుత్రులకు భారతావని ముక్కలైన భావోద్వేగం మాత్రమే మిగిలిందని అన్నారు. బ్రిటిష్ వారు స్వాతంత్ర సమయంలో భారతదేశాన్ని ఎలా ముక్కలు చేయాలని ఇంగ్లాండులోని radcliff ని ప్రత్యేక కమిషన్ నియమించి దానికి చైర్మన్ గా అతడిని పంపి ముస్లింలీగ్,కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరింది  కానీ, వాటి కారణంగా దేశ భూభాగం విషయంలో ఇల్లేమో భారతదేశంలో వ్యవసాయ భూమేమో బంగ్లాదేశ్ లో అన్న  మాదిరిగా విభజన చేసి, సరిహద్దుల అల్లర్లకు కారణమయ్యారని ఆరోపించారు.
 
భారతదేశంలో 84శాతం ఉండే హిందువులు ప్రస్తుతం 78శాతానికి వచ్చారని, అటు పాకిస్తాన్ లో 1 శాతానికే పరిమితమయ్యారని అయ్యారు.అక్రమచోరబాటుదారులకు దేశంలోని కొందరు రాజకీయ నాయకులే ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను ఇప్పిస్తూ వారి వారి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.బంగ్లాదేశ్ సరిహద్దులో పూర్తి ఫెన్సింగ్ ని వేసే ప్రయత్నాన్ని ఇదే కమ్యూనిస్టులు TMC వ్యతిరేకించారు, అక్రమ చొరబాటుదారుల కారణంగా సరిహద్దులలో అనధికారికంగా మసీదులు మదర్సాలు పుట్టుకొస్తున్నాయన్నారు.
 
దేశ కుల వృత్తుల్లో చొరబాటుదారుల ప్రవేశం కారణంగా హిందువులకు ప్రాధాన్యత తగ్గుపోతోందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో ఆయుధంగా ఎన్నో రాష్ట్రాల్లో వాడుకుంటున్న తరుణం మనం చూశామని, కానీ సర్ అనే ప్రక్రియతో నేడు అక్రమ ఓట్లు తొలగించబడ్డాయన్నారు.ఈ దేశంలో అక్రమ చొరబాటుదారుల వల్ల దేశంలో మాదకద్రవ్యాల దిగుమతులు పెరుగుతూ ఆర్థికంగా మానసికంగా దేశం నష్టపోతుందని, దీని నియంత్రణ కోసం ప్రస్తుత ప్రభుత్వాలు CAA,NRC ,immigration act ద్వారా అక్రమ చొరబాటుదారులను తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
 
మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తే వారిని అక్కున చేర్చుకోవాలని ఎంతో మంది మనకు హితబోధ చేసారు కానీ ఇతర దేశాలు తరిమేస్తే మన దేశం ఎందుకు స్థావరం కల్పించాలనేది ఆలోచించలేకపోతున్నారన్నారు. ప్రపంచంలో ముస్లింలు సంతోషంగా ఉన్న దేశం అది భారతదేశమే, భారతదేశం సెక్యులర్ గా ఉండాలంటే హిందువులు మెజారిటీ గానే 80% ఉండాలని అన్నారు. భారతదేశం తన సంస్కృతి సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉంటేనే ప్రపంచం భారత్ ను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది అని అన్నారు.మనమంతా సమాజాన్ని సంఘటిత పరుస్తూ పోతే సమాజమే దేశ వ్యతిరేక శక్తులను సంహరిస్తుందని అన్నారు.
 
ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన వైవీ గోపాలకృష్ణ మూర్తి మాట్లాడుతూ నేటి యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు. అక్రమ చొరబాటుదారుల వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని, దేశ భద్రత కోసం మనమందరం కూడా ఒక్కతాటిపై నిలబడి ముందు అడుగు వేయాలని పిలుపునిచ్చారు.