- రాంపల్లి మల్లికార్జున - నవయుగ భారతి
ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్ నుండి 1608 సంవత్సరంలో భారత్ లో అడుగు పెట్టింది, 1757 లో బెంగాల్ స్వాధీనం చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభించింది అంటే దానికి 149 సంవత్సరాలు పట్టింది. 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పై దేశమంతా స్వతంత్ర పోరాటం చేసింది అపోరాటం ను రెండు భాగాలుగాచెప్పుకోవచ్చు 1)బ్రిటిష్ సైన్యం లో చేరి పనిచేస్తున్నవాళ్ళు 2) ఆరోజులలో దేశంలో ఉన్న సంస్థానాలు. అట్లాపొరటానికి ఒక నాయకత్వం నిర్మాణం కావటానికిన 100 సంవత్సరాలు పట్టింది, అది అప్పటి మన దేశ పరిస్తితి. 1858 నుంచి బ్రిటిష్ పార్లమెంట్ నేరుగా భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించింది 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. పూర్తి స్వాతంత్రం సాధించుకొనేదుకు ప్రజలను సిద్ధము చేసేందుకు 90 సంవత్సరాలు పట్టింది . ఈ 90 సంవత్సరాల కాల ఖండంలో చోటు చేసుకొన్న పరిణామాలు దేశ విభజనకు దారి తీశాయి .
స్వాతంత్ర సాధనకు సాగిన ప్రయత్నాలు
1857 స్వతంత్రపోరాటం లో విజయం ఇతిమిద్ధంగా ఎవరది అనేది స్పస్టత లేదు. అపోరాటం అటు బ్రిటిష్ వాళ్ళకు ఒక హెచ్చరిక , భారతీయులకు ఒక గుణపాఠం.భారత దేశం కొంతకాలం అంతర్ముఖం అయింది. ఆరోజులలో దేశంలో సామాజిక పరిస్తితులను చక్కదిద్దుకోవటం, మరోప్రక్క బ్రిటిష్ వాళ్ళ విభజన రాజకీయాలను కాచుకోవటం మన ముందున్న సవాళ్ళు. వాటిని ఎదుర్కోవటానికి దేశం భీషణ సంగ్రామనికి సిద్ధం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభమైనయి. 1875 లో ఆర్యసమాజ్ ప్రారంభమైనది. ప్రారంభం లో ఆర్యసమాజ్ ప్రేరణతో విప్లవ కార్యకలాపాలు సాగాయి . అట్లాక్రమంగాదేశంలో జాగృతం ప్రారంభమైనది.ఈ దేశ ప్రజలు మరోసారి విరుచుకు పడకుండా ఉండటానికి బ్రిటిష్ వాళ్ళు అప్రమత్తం కావటం ప్రారంభమైనది.వాళ్ళ భేదతంత్రలు వాళ్ళు ప్రారంభించారు. 1885 వ సంవత్సరంలో కాంగ్రెస్ వేదికను ప్రారంభించి పరిస్తితులు తమ అదుపు తప్పకుండాచూసుకోవటం ప్రారంభించారు. మరోప్రక్క దేశ స్వాతంత్ర పోరాటంలో అధికారపక్షం లో ప్రతి పక్షాన్ని తయారు చేయాలని లేని పక్షం అదుపు తప్పే ప్రమాదాన్ని గుర్తించారు దా నికోసమై 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ ఢాకాలో మొదలు పెట్టించారు. అట్లా ఈ దేశ విభజనకి శ్రీకారం చుట్టారు. దానికి స్వాతంత్ర పోరాటం లో గాంధీజీ నాయకత్వం నుండి బ్రిటిష్ బేధ తంత్రానికి కలిసి వచ్చింది.అట్లా 1885 నుండి 1906 మద్యలో 1906 నుండి 1947 మద్యలో అనేక విపరిణామాలు చోటు చేసుకొన్నాయి దాని పరిణామం 1947 ఆగస్ట్ 14 దేశం ముక్కలై ప్రపంచపటం లో పాకిస్థాన్ అనే దేశం ఏర్పడింది .
దేశ విభజన పాఠాలు నేర్చుకున్నమా?
1000 - 1200 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ దేశ విభజన, అందులో1947 ఆగస్టు 14వ తేదీ నాడు భారతదేశము ముక్కలు చేయబడి ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఏర్పడింది. బహుశా ప్రపంచంలో మతం ఆధారంగా ఏర్పడిన దేశం ఆదేశమే, అదే పాకిస్తాన్. ఆదేశం ఏర్పడటమే విద్వేష భావం తో ఏర్పడింది. ఐదువేల సంవత్సరాల క్రితం ఒక రాజ్య విభజన మహాభారత సంగ్రామానికి దారి తీసింది, ఆ విభజన నుండి ఈ దేశం ఏమి పాఠం నేర్చుకోలేదు. అట్లా చరిత్రలో మనవైన అనేక తప్పిదాలు కనబడతాయి.
1947 ఆగస్టు 14న జరిగిన ఈ దేశ విభజన నుండి కూడా ఈ దేశ పాలకులు ఎటువంటి పాఠం నేర్చుకోలేదు. దేశ విభజనతో మనం ఏం సాధించుకున్నాము ? అంటే 1) ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేకపోయాం 2) వేలాది సంవత్సరాల ఈ దేశ సాంస్కృతిక జాతీయ భావాలకు అవమానం కలగచేయటమే కాక దాన్ని ప్రశ్నార్ధకం గా మార్చుకున్నాము. మతాన్ని జాతీయతో ముడిపెట్టి భిన్న సిద్ధాంతాలకు బలం చేకూర్చి , దేశ విభజనకు కారణమైన బ్రిటిష్ వాళ్ళ విభజించుపాలించ నీతిని కొనసాగిస్తున్న ఈనాటి మన పాలకుల దేశ ప్రజలను చీ లుస్తూ ఉన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా భారతదేశ రాజకీయాలు ఈ ద్వంద్వ నీతి నుంచి బయటపడలేదు.
దేశ విభజనకి దారితీసిన పరిణామాలు
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం పతనావస్థలో ఉన్నది ఆ తరుణంలో, అప్పటికే అగ్రరాజ్యము గా ఎదుగుతున్న అమెరికాను తన వైపు తిప్పుకోవడం ప్రమాదకరమని తెలిసినా జిన్నా వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తే, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుడు, పిల్లలు) నుండి సంపూర్ణ మద్దతుమీకు లభిస్తుందని మరియు కరాచీ, కలకత్తా, చిట్టగాంగ్ ఓడరేవులను అమెరికా వినియోగించుకునేందుకు షరతులు లేని అనుమతి ఇస్తామని హామీ ఇచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్వతంత్ర భారతదేశానికి అనుకూలంగా ఉన్న అమెరికన్లతో సంప్రదింపులు జరపడానికి కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకు రాలేదు. చివరకు పాకిస్తాన్ విషయంలో చర్చిల్ మరియు బ్రిటిష్ వారి పరోక్ష మద్దతుతో జిన్నా ప్రదర్శించిన మొండి వైఖరికి కాంగ్రెస్ తలొగ్గాల్సి వచ్చింది. తన సహచరులు చాలామంది దేశ విభజన వాస్తవికతగా అంగీకరించడాన్నిచూసి గాంధీజీ ఆశ్చర్యపోయారు; వయస్సు పైబడటం వల్ల తమలో పోరాట పటిమ తగ్గిందని, త్వరగా ఒక పరిష్కారం కోరుకునే వృద్ధులమని వారు గ్రహించారు. విభజనను అంగీకరించకపోతే జైలు శిక్ష, అంతర్యుద్ధం మరియు బ్రిటిష్ పాలన కొనసాగే ప్రమాదం ఉండేది; అదే సమయంలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తే అరాచకం మరియు భారీ రక్తపాతం జరిగే అవకాశం ఉండేది. జిన్నా మరియు ముస్లిం లీగ్ ఉనికిలో ఉన్నంత కాలం, ఐక్య భారతదేశం అనేది కేవలం ఒక కలగా లేదా అద్భుతంగా మాత్రమే మిగిలిపోతుందని గాంధీజీ గ్రహించారు. అందువల్ల, విభజనను స్వాగతించడం మరియు వాస్తవికతను అంగీకరించడమే అందరికీ శ్రేయస్కరం అనుకొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విజయం సాధించిన కూటమి ప్రపంచంలో కొన్ని దేశాలను ముక్కలు చేసింది ఆ వ్యూహంలో భాగంగానే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విభజించారు। ఈ విభజన వెనక అమెరికా భవిష్యత్ వ్యూహం ఉన్నది.. రష్యా ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆఫ్గనిస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అమెరికా పాకిస్తాన్ ను ఉపయోగించుకుంది.అట్లాగే బిన్ లాడెన్ ను అంతం చేసేందుకు అమెరికా పాకిస్థాన్ ను ఉపయోగించుకొన్నది. అంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ ను అమెరికాకి అప్పజెప్పారు . అప్పటినుంచి ఈరోజు వరకు కూడా పాకిస్తాన్ కు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అండదండలు అందిస్తున్నది అమెరికా అట్లనే తన అవసరార్థం చైనా కూడా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం మనం స్వతంత్రం వచ్చిన దగ్గరనుంచి జరుగుతున్న పరిణామాలలో మనం చూస్తూ వచ్చాం. అమెరికా ఆయుధాలతోనే పాకిస్తాన్ మతపరమైన ఉగ్రవాదానికి ప్రాణం పోసింది అది ఈరోజు వే ళ్లునుకుని ప్రమాదకర స్థాయికి చేరింది పాకిస్తాన్ దేశం ఇప్పటికీ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు భారత్ వ్యతిరేకతను ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కనబడట్లేదు పాకిస్తాన్తో మనకున్న సమస్యలను పరిష్కరించుకోలేకపోవటం ఒక కారణం అట్లాగే మన దౌత్యపరమైన వైఫల్యం. భారత శక్తివంతమై దేశ విభజన సమాసిపోయేట్లు చేయాలి అప్పుడే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ మన నాయకులు మేధావులు కనీసం దేశవిభజనను సమీక్షించేందుకు కూడా సిద్ధం గా లేకపోవటం అసలైన సమస్య.
పాకిస్థాన్ ఎట్లా ఉన్నది ?
75 సంవత్సరాలలో పాకిస్తాన్ అమెరికా చైనా ల ఉపగ్రహం గా మారినతీరు
పాకిస్థాన్ పుట్టికే భారతదేశం పై విద్వేషం, అది లేకపోతే పాకిస్తాన్ ఏర్పడేదే కాదు, ఆ విద్వేషం బలంగా ఉండేందుకు పాకిస్తాన్ నాయకులు వ్యూహరచన చేసుకుంటూ వచ్చారు, దాంతో పాకిస్తాన్ ఎటువంటి దేశంగా మారిపోయింది అంటే మనిషి రక్తం రుచి మరిగిన పులి ఎట్లా నరమాంసభక్షణ వేటిలో పడుతుందో పాకిస్థాన్ కూడా నరసంహార రుచి మరిగి విధ్వంసం రచన చేసుకొని ప్రయాణం చేసుకుంటూ తనకుతాను పతనం అంచుకు వేగంగా చేరుకొంటోంది. పాకిస్తాన్ లో 1948 సెప్టెంబర్ 11వ తేదీన మహమ్మద్ అలీ జిన్నా మరణించిన తర్వాత అధికారం లియాఖత్ అలీ ఖాన్ చేతిలోకి వెళ్ళిపోయింది, బలహీన నాయకత్వం సైనిక తిరుగుబాటు లకు తెరలేపింది దానితో పాకిస్తాన్ పూర్తిగా సైనిక నియంత్రణులోకి వెళ్లిపోయింది .అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటు చేశాడు. కాశ్మీర్ ఆక్రమించుకోవాలి అనే లక్ష్యం తో పాకిస్తాన్ క్రమంగా సైన్యాధికారుల నియంత్రణలోకి వెళ్ళిపోయింది 1948 లో కాశ్మీర్ ఆక్రమణకు జరిగిన మినీ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం వెనక్కి తిరిగి పారిపోవలసి వచ్చింది ఆ అవమానంతో భారత్ ను దెబ్బ కొట్టాలని 1965లో పూర్తిస్థాయి యుద్ధం చేసి ఘోర పరాజయం పాలైంది, ఒకరకంగా భారత్ ను విధ్వంసం చేయాలని లక్ష్యంతో తనను తాను విధ్వంసం చేసుకునే దిశలోపాకిస్తాన్ పడిపోయింది. దాని పతనం 1965 నుండి క్రమంగా ప్రారంభమైందని చెప్పవచ్చు, దాని పరిణామం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రాల వైపు మళ్ళిపోయింది, ఎందుకంటే సైనిక శక్తితో భారత్ ను నియంత్రించడం అసాధ్యమని వాళ్లకు అర్థమైంది. ఏ ఉగ్రవాదాన్ని భారత్ కు వ్యతిరేకంగా నిర్మాణం చేయాలనుకుందో ఆ ఉగ్రవాద కోరల్లో పాకిస్తాన్ చిక్కుకుని పోయింది, దానితో ఆ దేశం భౌగోళికంగా ఒక కీలక స్థానంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా శక్తివంతమై ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచలేకపోగా భారత్ తో ఆయుధ పోటీలో అణ్వయుధాలు కూడా తయారు చేసుకుంది, ప్రపంచాన్ని బెదిరించాలని, భారత్ ను కట్టడి చేయాలని పగటి కలలు కంటూ ఉన్నది , పాకిస్తాన్ కు కలిసి వచ్చింది ఏమిటంటే దక్షిణాసియా పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న అమెరికా చైనా దేశాలు పాకిస్తాన్ ప్రక్కకు చేరిపోయాయి , పాకిస్తాన్ ఆ దేశాలకు ఉపగ్రహ దేశంగా మారిపోయింది,
అమెరికా చైనా రెండు దేశాలు పాకిస్తాన్ కు ఆర్థిక అండదండలు అందిస్తూనే పాకిస్తాన్ నాయకులను అంతరంగికంగా బందీచేశాయి , పాకిస్తాన్ సైనిక అభివృద్ధి పై పెట్టిన దృష్టి పారిశ్రామిక అభివృద్ధి పై పెట్టలేకపోయింది, మౌలిక సదుపాయాలను విస్తరణ విస్మరించింది, పాకిస్తాన్ తన సైనిక శక్తిని పెంచుకునేందుకు ఆఫ్గనిస్తాన్ పరిణామం కూడా కలిసి వచ్చాయి అదే ఆ దేశాన్ని సర్వనాశనం చేసే దిశలో మళ్లిస్తున్నదని అంచనా వేయలేకపోయింది, దానితో అమెరికా చైనా కు బందీ అయిపోయింది. అమెరికా చైనా రెండు కూడా పాకిస్తాన్ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడలేదు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యం, అట్లాగే చైనాకు అరేబియా సముద్రంపై తన ఉనికిని కాపాడుకోవడం లక్ష్యం. అమెరికా చైనా రెండు దేశాలు తమ లక్ష్యసాధనకు పాకిస్తాన్ ను తమ చెప్పు చేతలలో ఉంచుకునే ప్రయత్నం సాగించాయి . ఈ రెండు కూడా పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ స్టేట్ గా తనంతట తాను నిలబడనీయకుండా అస్థిరపరుస్తూనే వస్తున్నాయి, పాకిస్తాన్ ఎటువంటి దయనీయ స్థితిలో చిక్కుకొని పోయిందంటే ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ శక్తిగా ఎదిగిన చైనా మిత్ర దేశం అయినప్పటికీ తన సొంత ప్రజలకు కడుపు నింపక లేకపోతున్నది. పాకిస్తాన్ లో ఉగ్రవాద పరిశ్రమ మినహా మిగిలిన పరిశ్రమలన్నీ క్షీణ దశలో ఉన్నాయి.
సామాజికంగా కూడా గందరగోళంలో ఉన్నది ఆ విషయాలు కూడా చూద్దాం . ‘’పాకిస్తాన్లో ఐక్యత తీసుకురాలేని ఇస్లామీ కరణ’’ అనే వ్యాసం రాస్తూ ప్రఖ్యాత జర్నలిస్ట్ శ్రీ జి హెచ్ జాన్సన్ ఇలా అంటాడు రెండుసార్లు నేను పాకిస్తాన్ సందర్శించి వచ్చాను ఆ సమయంలో అప్పుడున్న జియా హుల్ హక్ తో మాట్లాడిన తర్వాత నాకు తెలిసినది ఏమంటే పాకిస్తాన్లో ఇస్లామీకరణ పాటించటం లేదు, అయితే అధికారికంగా దానిని ప్రజల మీద రుద్దుతున్నారు చివరకు పనిచేయటం లేదని తెలిసిపోతుంది పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఒకసారి మాట్లాడుతూ ఒకవేళ ఈ ప్రపంచంలో ఇస్లామ్ మతం ఉన్నపళంగా మాయమైపోతే ఇరాన్ ప్రాంతం వాళ్ళు ఇరానీయన్లుగా ఇరాక్ వాళ్ళు ఇరకీయులుగా , ఆరేబియన్లు అరేబియన్లుగా ఈజిప్టు వాళ్ళు ఈజిప్ట్ గా మిగిలిపోతారు మేము ఎవరిలో మా గుర్తింపు పొందాలి అని ఆవేదనను వ్యక్తం చేశాడు.
భారత్ అనేక ఆటంకాల మధ్య ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న తీరు
భారత్ కు ఇస్లామిక్ పాకిస్తాన్ ఒకేవైపు, మరోపక్క బంగ్లాదేశ్, ఇంకొక ప్రక్క చైనా ల ఆక్రమణలు ఎత్తుగడలను ఎదుర్కొంటూ దానికి మూల్యాన్ని చెల్లించుకుంటూ , వాళ్లను కాచుకుంటూ వస్తున్నది, స్వాతంత్ర పోరాట కాలం నుండి వస్తున్న సైద్ధాంతిక సంఘర్షణలు ,సామాజిక సమస్యలతో ప్రయాణం సాగుతున్నది . అంతర్గతం గా దేశంలో మరన్ని పాకిస్థాన్ లు నిర్మాణం చేసే ప్రయత్నం జరుగు తున్నాయి. ఆ శక్తు ల కార్య కలపాలు, చేసే దాడులు, మతం మార్పిడిలు ఆక్రమణలు, విధ్వంసరచనలు, ఎదుర్కొంటూనే దేశాభివృద్ధి, దేశంలో శాంతి పరిరక్షణ, ఆర్థిక, సైనిక, సామాజిక, శక్తిగా నిర్మాణం అవుతూ రాజకీయ స్థిరత్వం సాధించే దిశలో భారత్ వేగంగా ప్రయాణం చేస్తున్నది, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా వేగంగా ఎదుగుతూ వస్తున్నది అభివృద్ధి వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నది. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం అవుతున్నది, సామాజిక అసమానతలను, పేదరికాన్ని గణనీయంగా తగ్గించుకుంటూ దేశం ముందుకు సాగుతున్నదని చెప్పవచ్చు. దేశ సార్వభౌమత్వం కాపాడుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకొన్నది.
దక్షిణాసియా లో శాంతి సుస్థిరత –భారత్
భారత్ దక్షిణాసియా లో చాలా కీలక మైంది .దక్షిణాసియా లో శాంతి సుస్థిరత సాధించాలంటే భారత్ శక్తి వంతం కావాలి.ఆఫ్గనిస్టాన్ మినహా దక్షిణాసియా దేశాలు భారత్ సరిహద్దులు కలిగి ఉన్నది. సంస్కృతి పరంగా కూడా వేల సంవత్సరాలనుండి భారత్ తో పెనవేసుకుని ఉన్నది. అఖండ భారత్ ఒకప్పుడు సామజిక ఆర్ధిక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలను పటిష్టం చేసుకోవలసిన అవసరం ఉన్నది. భారతదేశ సరిహద్దులలో ఉన్న పాకిస్తాన్, బాంగ్లాదేశ్ దేశాలతో సమస్యలు ఉన్నాయి కశ్మీర్ సమస్య విషయంలో అంతర్గతంగా చక్కదిద్దుకొనే ప్రయత్నం ఒక ప్రక్క చేస్తుంటే మరోప్రక్క పాకిస్తాన్ ఆక్రమణ లో ఉన్న కశ్మీర్ సమస్య తీవ్రమౌతుంది pok భారత్లో కలవటానికి పెద్దఎత్తున పోరాటం జరుగుతున్నది. మొత్తం మీద భారత్ శక్తి వంతమైయితే నే .దక్షిణాసియా లో శాంతి సుస్థిరత ఉంటుంది.
ముగింపు
భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు ఒకే పరిస్థితి లో ప్రయాణం ప్రారంభించిన పాకిస్తాన్ ఆత్మహత్యా సదృశ్యంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దాని కోరల్లో తాను చిక్కుకుంటూ భారత్ ను కూడా చిక్కించాలని ప్రయత్నం చేస్తూ తన అస్తిత్వాన్ని కోల్పోయే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది. . ఈ మద్య బెలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించకొంది , ఆదిశలో POK, సింధు ప్రాంతాలు ఉన్నాయి . భారత్ పై విద్వేషం పెంచుకొని ఒక ప్రక్క తనను తాను నాశనం చేసుకుంటూ భారత్ లో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి వ్యూహరచనలు చేస్తున్నది, దానికి సహకరించే శక్తులు మన దేశంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి, ఆశక్తులతో వ్యవహారం అతి సున్నితంగా, కఠినంగా ఉన్నది. భారత్ ఈ శక్తుల ఆట కట్టించి ప్రపంచంలో రెండు లేక మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశలో అడుగులు పడుతున్నాయి, రాజకీయ స్థిరత్వం సామాజిక ఐక్యత సాధించే దిశలో ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి, విధ్వంస రచనతో పుట్టిన పాకిస్తాన్ పడిపోతూ ప్రపంచ పటం నుండి తొలిగి పోయే దిశలో దాని అడుగులు పడుతున్నాయి భారతదేశంలో ప్రజలు జాగృతమై పాకిస్తాన్ ఎత్తుగడలను వమ్ము చేస్తే ప్రపంచంలో మనకు తిరుగులేదు, అట్లా ప్రజలను సంసిద్ధం చేయటమే ఈ 79 సంవత్సరాల ప్రయాణం మనకు నేర్పుతున్న గుణపాఠం.