దేశీ ఆవులను సంరక్షిస్తున్న రైతులకు సన్మానం

VSK Telangana    18-Aug-2026
Total Views |
krmr
 
కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామం ఈ వేడుకల వేళ ఒక అద్భుతమైన సన్నివేశానికి వేదికైంది. ఆధునికత వైపు పరుగులు తీస్తూ మన మూలాలను, గ్రామీణ సంస్కృతిని మర్చిపోతున్న ఈ రోజుల్లో, మైలారం గ్రామ సర్పంచ్ తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం అందరి హృదయాలను హత్తుకుంది.
 
మన దేశీయ ఆవులు కేవలం పశువులు మాత్రమే కాదు; అవి మన పాడిపంటలకు జీవనాధారం, మన సంస్కృతికి ప్రతిరూపాలు. అటువంటి నాటు ఆవులను ప్రాణప్రదంగా కాపాడుకుంటూ, మూడంటే మూడు కంటే ఎక్కువ దేశీ ఆవులను సాకుతున్న రైతన్నలను గౌరవించాలని సర్పంచ్ తలపెట్టడం నిజంగా అభినందనీయం. ఈ పవిత్రమైన కార్యక్రమానికి స్వతంత్ర దినోత్సవ వేడుకలను వేదికగా ఎంచుకోవడం ఆ నిర్ణయానికున్న ప్రాధాన్యతను మరింత పెంచింది.
 
జెండా పండుగ నాడు, ఊరి పండుగలా సాగిన ఈ వేడుకలో గ్రామానికి చెందిన పది మంది ఆదర్శ రైతన్నలను గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సన్మానించారు. సన్మానం పొందుతున్న ఆ రైతుల కళ్లలో ఆనందం, వారి కష్టానికి లభించిన గౌరవాన్ని చూసి ఊరంతా గర్వపడింది.
 
ఆవుల సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన ఆ 10 మంది రైతన్నలు:
 
బొమ్మ మహేష్
 
దుడ్డు నాగరాజు
 
దుడ్డు పర్శరాములు
 
పులి వెంకటేష్
 
నాగవెల్లి లక్ష్మీరాజం
 
బొమ్మ సదాశివ్
 
నూకల మోండయ్య
 
బండి రాములు
 
నూకల ప్రవీణ్
 
మడికంటి అశోక్
 
ఎండనక, వాననక కష్టపడుతూ దేశీ పశుసంపదను కాపాడుతున్న ఈ నేల పుత్రులకు లభించిన ఈ గౌరవం, మిగతా రైతుల్లో కూడా కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపింది. మన దేశీ ఆవులను కాపాడుకోవడమంటే మన సంస్కృతిని, మన భవిష్యత్తును కాపాడుకోవడమేనని చాటిచెప్పిన మైలారం గ్రామం, నేడు చుట్టుపక్కల అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.