డాక్టర్ హెడ్గేవార్ ఓ యుగాన్ని దర్శించిన మహా మనీషి. హిందూ సంఘటన ప్రారంభించి, హిందూ జన జీవన చైతన్యానికి ఆయన అనుసరింపజేసిన ప్రణాళికలో ఉత్సవ ప్రణాళిక ఒకటి. ఆయన మొత్తం ఆరు ఉత్సవాలను ఎంచుకున్నారు. ఉగాది, శివాజీ పట్టాభిషేకం, వ్యాస పూర్ణిమ, శ్రావణ పౌర్ణమి, విజయ దశమి, సంక్రాంతి. వీటిని హిందూ ప్రజలు అర్థవంతంగా నిర్వహించుకోవాలని వారు అభిలషించారు. ఇందులో భాగంగానే రక్షా బంధన్ ఒకటి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ రక్షా బంధన్ పండగ ఆధారంగా సమాజంలో భ్రాతృభావనను, ఐక్యతను, ఏకీకృత శక్తిని పెంచడానికి ఆచరింపజేస్తున్నది. వ్యక్తులలో అనేక గుణాలు వుండొచ్చు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతి కలిగింపజేసే చాతుర్యం, విద్వత్తు తదితర కౌశలాలూ వుండొచ్చు. కానీ అవి సమాజానికి అభిముఖంగా, ఉపయోగకరంగా నడవకపోతే లాభం లేదు. ‘‘మణి: వజ్ర సముత్కీర్ణౌ, సూత్రస్యాస్తిమేగతి:’’ అని మహాకవి కాళిదాసు అన్నారు. మణులు విడివిడిగా ఎన్నిపడి వున్నా, లాభం లేదు. వాటిని ఒకచోట చేర్చారి. తాననుకున్న ఊహతో, తానూమించిన రూపంలోకి మలచాలి. అలా మలచిన ఆ విడివిడి మణులను ఒక సూత్రంలోకి బంధించాలి. మాల అందంగా వుండాలంటే దానిలో ఒక క్రమం, ఒక ఊహ వుండాలి. ఏకసూత్రత లేక, ఊహలేక ప్రోగుపోస్తే దానికి విలువ లేదు. ఆరెస్సెస్ ఈ మణులను మెరుగుపెట్టి, తొలచి, మలచి, పరస్పరం అందరం ఒకే మాలగా రూపొందించేందుకు సంఘటన రూపంలో ఎత్తి గుచ్చుతూ వున్నది.
మన దేశం శక్తి కుటుంబం నుంచి ప్రారంభం. కుటుంబాలలో తమ తోడబుట్టిన సోదరీమణులను అన్ని విధాలా కాపాడుకోవడం సోదరుడి కర్తవ్యం. దానిని గుర్తు చేసేదే రాఖీ పండగ. ముస్లింల పరిపాలనా కాలంలో రాజపుత్ర స్త్రీలు ఆపదలో సోదర సమానులైన రాజపుత్ర వీరులకు రాఖీలు పంపి, కాపాడుకున్న సందర్బాలు చరిత్రలో అనేకం. మన దేశం ధర్మం రక్షణకు పరస్పరం కలిసి పనిచేయాలనే భావనను సంఘం సమాజంలో జాగృతం చేస్తున్నది. ఇలా రక్షాబంధన్ వికసిస్తూ వస్తున్నది. భగవంతుడు మనిషకి మరుపు అనే వరం ఇచ్చాడు. దానితో పాటు ఏది మరవాలి? ఏది మరువకూడదు? అన్న విచక్షణ వివేకాన్ని కూడా ఇచ్చాడు. మనం అప్పుడప్పుడు మరువ కూడనివి మరిచిపోయి ప్రమాదాలు తెచ్చుకుంటాం.
‘‘అహింసా పరమో ధర్మ:’’ అనే ఈ వాక్యం గౌతమ బుద్ధుని కాలం నుంచి గాంధీ వరకు అనేక మంది చెప్పడం మనం వింటుంటాం. దాని పూర్వాపరాలు గమనిస్తే ఈ పదబంధం మొదట మహా భారతంలో వుంటుంది. మరియు సాహిత్య పరంగా అహింస అంతిమ కర్తవ్యం అని అర్థం. అది అన్ని ఇతర విధులను అధిగమిస్తుంది. అహింసను నొక్కి చెప్పడానికి గాంధీ ఎక్కువగా ప్రాచుర్యం పొందిన సంస్కృత పదబంధాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పునరుక్తి చేస్తున్నారు. దీనితో హిందూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు వాస్తవంగా మహాభారతంలోని పూర్తి బంధం.
అహింసా పరమ ధర్మం అలాగే. ధర్మ రక్షణలో హింస కూడా అంతే, అంటే అంతిమంగా ధర్మ సంరక్షణే మన అందరి బాధ్యత దానికి హింస, అహింస దేనినైనా అనుసరించవచ్చు. ఈ విషయాన్నీ విస్మరిస్తే ఎలాంటి ఫలితాలు వుంటాయో మన చరిత్రే సాక్ష్యం. కాబట్టే ధర్మ సంరక్షణకు పరస్పనం కలిసి పనిచేయాలని సందేశమే రక్షాబంధన్ చెప్పేది.
భారత దేశ చరిత్ర చెప్పే పెద్ద గుణపాఠం అంతర్గత ద్రోహులే. వీరే అసలైన శత్రువులు. ఆ వారసత్వం కొనసాగుతూనే వుంది. ఈ దేధం ఎప్పుడైనా ఓడిపోయింది అంటే అంతర్గత ద్రోహులే అసలు కారణం. శతాబ్దాల చరిత్ర చెప్పే సత్యమిది, ఇది ముస్లిం ఆక్రమణ కావచ్చు, పశ్చిమ దేశాల ఆక్రమణ కావచ్చు చరిత్ర నిండా అదే మనకు కనిపిస్తుంది. ఈ చారిత్రక గుణపాఠం గుర్తించకపోవడమే ఈ దేశం ఎదుర్కొంటున్న అసలైన సవాలు. ఈ సవాలు గుర్తించాలంటే ఇంకా కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి.
చరిత్ర గురించి సరైన అవగాహన లేక, ఎవరో కల్పించిన అసత్యాలను నమ్ముతూ మన ఉనికిని, మన భవిష్యత్తును మనం ప్రశ్నార్థకం చేసుకోవడం, అందులో ప్రపంచంలో మనలను మించినవారు ఎవరూ లేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే మనకు అసలైన సమస్య.
2. అలాగే తమ తప్పులు బయటకు రాకుండా ఎదుటి వారిలో తప్పులు వెతకడమే ఎడారి మతాల వారి నీతి. అదే తమ బలంగా వారు భావిస్తారు, దీనిలో వారిని మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. దీనిని హిందూ సమాజం అర్థం చేసుకోలేకపోవడం మరో ముఖ్య సమస్య.
3. గోబెల్స్ ప్రచారం అని వింటాం. దాని అర్థం ఒక అబద్ధాన్ని పదేపదే మాట్లాడుతూ అదే సత్యమని నమ్మించే ప్రయత్నం. ఆ గోబెల్స్ ను మించిన వారు మన వామపక్షం వారు. వీరిని చూసి గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అంతటి ఘనులు వీళ్లు. వీళ్ల దుష్ప్రచారాలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం
4. మన హిందూ సమాజంలో పరమేశ్వరుడు ఒక్కడే అనే తాత్విక ఆలోచనతో మన దేశంలో అనేక మతాలు సంప్రదాయాలు వికసించాయి. ఆ మతాలన్నీ సమానమని మన పెద్దలు చెబితే, సత్యాసత్య వివేకం కోల్పోయి, ఎడారి మతాల లాంటి వాటిని కూడా కలుపుకొని అన్ని మతాలు సమానమని భజనలు చేసేవాళ్లు మనవారే. ఇలాంటి వాళ్లందరూ కలిసి దేశంలో గందరగోళం సృష్టించడం, సాగిపోతూ వున్నది. దీని నుంచి బయటపడి, సత్యాసత్య వివేకాన్ని జాగృతం చేయడమే ఇప్పటి తక్షణ కర్తవ్యం. దానికి మనం అందరమూ పరస్పర రక్షకులుగా వుండాలి.
అలాగే ఈ సందర్భం 1950 జనవరి 26 న రాజ్యాంగాన్ని అమలు చేసుకునే రోజును నిర్ధారిస్తూ రాజ్యాంగానికి తుది రూపమిస్తూ 1949 నవంబర్ 25 న రాజ్యాంగ సభను ఉద్దేశించి అంబేద్కర్ చెప్పిన కొన్ని మాటలు చూద్దాం.
ఈ దేశం రాజకీయ ప్రజాస్వామ్యం సాధించుకుంది. ఇంకా సాధించుకోవాల్సింది సామాజిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అది ఒక జీవన విధానం. ఆ జీవన విధానంలో 1. స్వేచ్ఛ 2. సమానత్వం 3. సోదర భావం. ఈ మూడూ ఒకదానితో ఒకటి కలిసే వుంటాయి. వీటిని విడదీయడం సామాజిక ప్రజాస్వామ్యానికి అర్థమే వుండదు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల్లో ఆధిపత్యాన్ని తెస్తుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదర భావం లేనిచోట స్వేచ్ఛ సమానత్వం సహజంగా వుండలేవు. కాబట్టి సోదరభావం ఆధారంగా సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవాలి.
అందుకే వైవిధ్య భరితమైన హిందూ సమాజంలో సహోదర భావం నిర్మాణం చేసే పనిని ఆరెస్సెస్ స్వీకరించింది. ఆ దిశలో పనిచేస్తున్నది. తద్వారానే హిందూ సమాజ సంఘటన సాధ్యమవుతుంది. అదే ఈ దేశం యొక్క సామాజిక ప్రజాస్వామ్యం.