తెలుగు ప్రాంతాల్లో ఆరెస్సెస్ చరిత్ర... పుస్తకావిష్కరణ కార్యక్రమం

VSK Telangana    03-Aug-2026
Total Views |
 
rss
 
"తెలుగు ప్రాంతాల్లో ఆరెస్సెస్ చరిత్ర" పుస్తకావిష్కరణ సభ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం  ఖడగ్ పూర్‌లోని షిర్డీ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 'సామాజిక సమరసత వేదిక' అఖిల భారతీయ సంయోజక శ్యాంప్రసాద్, డాక్టర్ బెనర్జీ, తపస్ భట్టాచార్య పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ తర్వాత నిర్వాహకులు పుస్తక పరిచయం కూడా చేశారు.
 
rss2
 
ఈ కార్యక్రమం ప్రారంభంలో బాలికలు నృత్యం, కోలాట ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కళలను  ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సభలో మొత్తం 375 మంది పాల్గొనగా వీరిలో 175 మంది మహిళలున్నారు.