ఆదిలాబాద్ లో బంగ్లాదేశీయుల అరెస్ట్.. రాత్రి పూట రెక్కీలు,దొంగతనాలు

VSK Telangana    05-Aug-2026
Total Views |
 
adb
 
ఏదో బెంగాల్, కేరళ, హైదరాబాద్ లో అక్రమ బంగ్లాదేశీయులు పట్టుబడ్డారంటే అనుకోవచ్చు. కానీ.. ఏకంగా ఆదిలాబాద్ లో బంగ్లాదేశీయులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆదిలాబాద్ లోని కైలాస్ నగర్ లో ఓ దొంగతనం జరిగింది. ఈ కేసులో పోలీసులు విచారించగా దొంగతనం కేసులో మహ్మద్ జౌనీ అలీ పట్టుబడ్డాడు.అలాగే మహ్మద్ రుమాన్ అలీ కూడా పట్టుబడ్డాడు.అయితే జౌనీ అలీ అతనే ప్రధాన నిందితుడు కూడా. కొన్నేళ్లుగా సుమారు 10 నుంచి 12 సార్లు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడ్డాడు.అలాగే వివిధ రాష్ట్రాల్లో ఇళ్ల్లో కూడా చోరీలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో బంగ్లాదేశీయుల ముఠాలతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు.
 
కైలాస్ నగర్ లో చోరీ చేసిన క్రమంలో మహ్మద్ జౌనీ అలీని అరెస్ట్ చేశారు. ఈయనకు సంబంధించిన విషయాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ మీడియాకు వెల్లడించారు. తమ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయన్నారు. సుమారు తొమ్మిది సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఈ ముఠా దొంగతనాలు చేస్తోందని తెలిపారు. ప్రధాన నిందితుడు మహ్మద్ జసనీని విచారించగా, చాలా విషయాలు బయటపడ్డాయన్నారు.
రాజస్థాన్, ఒడిశా, కర్నాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ ఇళ్ల తాళాలు పగలగొట్టి, దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విలువైన వస్తువులు, బంగారం, వాహనాలను కూడా చోరీ చేస్తున్నట్లు తేలింది.
 
ఈ నిందితులు పగటి పూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు, రిపేర్ చేస్తున్నట్లు సంచరిస్తారని, రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి వున్న వాటిని గుర్తిస్తారని తెలిపారు. ఆ తర్వాత రాత్రి సమయంలో ఆ తాళాలను పగలగొట్టి,చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.