మెదక్ : తుప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను అనాథనని చెప్పుకుంటూ ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. గుండ్రెడ్డి పల్లికి చెందిన ఓ హిందూ కుటుంబం తమ అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ జిల్లా కౌకూర్ దర్గాకి వెళ్లారు. అక్కడే హేమంత్ అని పేరు చెప్పుకుంటూ వుంటున్న ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. దగ్గరయ్యాడు కూడా. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో హేమంత్ అనే వ్యక్తికి ఘనంగా వివాహం కూడా జరిపించారు.
అయితే.. కొన్ని రోజులకు హేమంత్ అనే వ్యక్తి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. అతడ్ని ఫాలో కూడా అయ్యింది. చివరికి హేమంత్ ఫోన్ ని కూడా పరిశీలించగా.. ఇతర మహిళలతో సన్నిహితంగా వున్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో భార్య భర్తల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో హేమంత్ ఊరు విడిచి వెళ్లిపోయాడు.కొన్ని రోజుల తర్వాత తిరిగి గ్రామానికి రావడంతో గ్రామస్థులు అతడ్ని చితకబాదారు.
దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను అనాథ కానని, తనకు కుటుంబం వుందన్నాడు. అంతేకాకుండా తన పేరు హేమంత్ కాదని, నాజర్ అని చెప్పుకొచ్చాడు. తమది గుంటూరు అని, తమ కుటుంబం అక్కడే వుంటోందని తెలిపాడు. చివరికి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.
హిందూ సంస్థలు, హిందూ సంఘాలు చాలా రోజులుగా హిందూ కుటుంబాలను జాగృతం చేస్తూనే వున్నాయి. విధర్మీయులు ఓ పద్ధతి ప్రకారం హిందూ కుటుంబాలను టార్గెట్ చేస్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తూనే వున్నాయి. మన చుట్టు పక్కల ఎవ్వరు అనుమానంగా కనిపించినా, చాలా జాగ్రత్తగా వుండాలని, కదలికలను కూడా గమనించాలని చెబుతూనే వస్తున్నారు.