హైదరాబాద్ : పాతబస్తీలోని మాదన్నపేట ప్రాంతంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమం, అన్నదానంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2బీహెచ్ కే పోలీస్ హౌసింగ్ సొసైటీ వద్ద గణేష్ ఊరేగింపుతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగతున్న సమయంలో పై అంతస్తుల నుంచి కొందరు దుండగులు బీఫ్ లాంటి మాంస పదార్థాలను విసిరేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు హిందువులు. భక్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని, నిరసనకు దిగారు.
దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అదే హౌసింగ్ సొసైటీలో నివాసం వుంటున్న మహ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ కి తరలిస్తున్నామని డీసీపీ ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని, వందతులను ఎవ్వరూ నమ్మవద్దని డీసీపీ కోరారు.