నాగపూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయ దశమి ఉత్సవం ఈ సంవత్సరం నాగపూర్ రేషంబాగ్ లో అక్టోబర్ 20 వ తేదీన జరగనుంది. ఉదయం 7:40 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దైనిక్ జాగరణ్ పత్రిక ఎడిటర్ -ఇన్ చీఫ్ సంజయ్ గుప్తా హాజరుకానున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రతి యేటా విజయ దశమి రోజున ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నాగపూర్ లో జరిగే విజయ దశమి ఉత్సవానికి అత్యంత ప్రాముఖ్యత వుంటుంది. ఈ యేడాది జరిగే కార్యక్రమానికి మరింత ప్రాముఖ్యత వుంది. ఆర్ఎస్ ఎస్ కార్య శతాబ్ది సమయంలో ఈ విజయ దశమి ఉత్సవం జరగబోతోంది.
డా. కేశవ రావ్ బలిరాం హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను 1925 లో విజయ దశమి రోజునే స్థాపించారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ నిర్వహించే ఉత్సవాల్లో విజయ దశమి ఉత్సవం కూడా ఒకటి.
గత యేడాది అంటే 2025 లో జరిగిన విజయ దశమి ఉత్సవానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ గోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.