
ప్రాచీన భాష అయిన సంస్కృతానికి నేటి ఆధునిక కాలానికి తగినట్లుగా జీవం పోసేందుకు ఇద్దరు యువతులు వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. సంస్కృత భాషను నేటి 'జెన్ జెడ్' (Gen Z) యువతకు సులభంగా, ఆకర్షణీయంగా మరియు చేరువ చేసే లక్ష్యంతో 'ట్రైబ్ సంస్కృత్' (Tribe Sanskrit) వేదికను ఏర్పాటు చేశారు.
కోయంబత్తూరుకు చెందిన 25 ఏళ్ల హృదయ సురేష్ , మంగళూరుకు చెందిన 22 ఏళ్ల వినమ్ర హెర్లే (Vinamra Herle) ఈ వేదికకు సహ-స్థాపకులుగా వ్యవహరిస్తున్నారు. కొచ్చిలోని చిన్మయ విశ్వవిద్యాతీపిలో సంస్కృతంలో పీజీ పూర్తి చేసిన ఈ ద్వయం, విద్యార్థి దశలో ఎదుర్కొన్న డిజిటల్ రిసోర్సెస్ కొరతను అధిగమించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు.
పాటలు, రీల్స్, హిప్-హప్ రాప్ , పాపులర్ కల్చర్‌ను జోడించి సంస్కృత భాషను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భగవద్గీత ఆధారిత రాప్ సాంగ్స్, ప్రముఖ టెలివిజన్ థీమ్స్, కార్టూన్ జింగిల్స్‌తో పాటు మలయాళం, రాజస్థానీ వంటి ప్రాంతీయ ప్రసిద్ధ పాటలకు సంస్కృత రూపాలను అందిస్తూ ఇంటర్నెట్‌లో విశేష ఆదరణ పొందుతున్నారు. సాంప్రదాయ విలువలను కోల్పోకుండా, విజువల్ అనుభూతిని పంచుతూ ఈ ప్రాచీన భాషను యువతకు నిత్యజీవితంలో భాగం చేసేలా వీరు చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది.