(సెప్టెంబర్ 29 - ప్రపంచ హృదయ దినోత్సవం)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించే ఒక గంట "శాఖ" (Shakha) శారీరక దారుఢ్యానికి మానసిక వికాసానికి మాత్రమే కాకుండా మన హృదయం ఆరోగ్యం (Heart Health)గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆధునిక కాలంలో పెరిగిపోతున్న శారీరక శ్రమలేమి, ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ శాఖకు వెళ్లడం వల్ల గుండె ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటుందో క్రింది అంశాల ద్వారా తెలుసుకోవచ్చు:
శాఖలో చేసే యోగాసనాలు, సూర్యనమస్కారాలు, వ్యాయామం మరియు సమత (కవాతు/Drill) వంటివి గుండెకు సరైన వ్యాయామాన్ని (Cardio Exercise) ఇస్తాయి. వీటి వల్ల గుండె కండరాలు బలపడి, ప్రతి స్పందనతో శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం పెరుగుతుంది. నిరంతర వ్యాయామం వల్ల రక్తనాళాలు విస్తరించి, అధిక రక్తపోటు (High BP) అదుపులోకి వస్తుంది.
శాఖలో ప్రతిరోజూ ఆడే కబడ్డీ, ఖో-ఖో, వంటి సాంప్రదాయ భారతీయ ఆటలు "హై-ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్" (HIIT) లాగా పనిచేస్తాయి. పరిగెత్తడం, వేగంగా దిశలు మార్చడం వల్ల హృదయ స్పందనల రేటు పెరుగుతుంది. ఇది గుండె సామర్థ్యాన్ని పెంచి శక్తిని రెట్టింపు చేస్తుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ: ఆటల ద్వారా కరిగే క్యాలరీలు చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతాయి. దీనివల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
ప్రాణాయామం
శాఖలో నేర్పించే వివిధ రకాల ప్రాణాయామాలు, శ్వాసక్రియ వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి వలన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సరి అయిన స్థితిలో ఉంటాయి. గుండె తక్కువ శ్రమతోనే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను అందించగలుగుతుంది. రక్తనాళాలు గట్టిపడకుండా (Atherosclerosis) ప్రాణాయామం కాపాడుతుంది.
గుండెపోటుకు ప్రధాన కారణాల్లో 'మానసిక ఒత్తిడి' (Stress) ఒకటి. శాఖ ముగింపులో చేసే సామూహిక ప్రార్థన, దేశభక్తి గీతాలు, నైతిక విలువల చర్చలు, సకారత్మకమైన ఆలోచనలు మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు విడుదల కావడం తగ్గుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు సాధారణ స్థితికి వచ్చి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.
జీవ గడియారం (Circadian Rhythm) క్రమబద్ధీకరణ
శాఖలు ప్రతిరోజూ ఉదయం (ప్రభాత శాఖ) లేదా సాయంత్రం నిర్ణీత సమయానికి ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ శాఖకు వెళ్లే అలవాటు వల్ల శరీరంలో జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది.
రాత్రి వేళల్లో మంచి నిద్ర పడుతుంది. సరైన నిద్ర గుండె కండరాలకు విశ్రాంతినిచ్చి, మరుసటి రోజుకు పునరుత్తేజం కలిగిస్తుంది.
ప్రతిరోజూ శాఖలో కేటాయించే ఒక గంట సమయం ఒక సంపూర్ణమైన 'కార్డియో ప్రాక్టీస్' లాంటిది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా శాఖకు వెళ్లడం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా గుండెను జీవితాంతం పటిష్టంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.