గుంటూరులో 15 ఏళ్ల బాలిక కిడ్నాప్ అయ్యింది. సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్ స్టాలో షేక్ జాన్ సైదా (28) అనే ముస్లిం యువకుడు ఆ బాలికతో పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో ఆమెను తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇది పోలీసులకు సవాల్ గా మారిపోయింది. మూడు నెలలుగా స్థావరాలు మారుస్తూ.. రాష్ట్రాలు తిరుగుతున్నారు.హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఈ విషయంలో ఏకంగా సిట్ ను ఏర్పాటు చేశారు. బాలిక అదృశ్యం కేసును పోలీసులు కిడ్నాప్ కేసుగా మార్చేశారు. చివరికి సెప్టెంబర్ 4న హర్యానాలోని కర్నాల్‌లో జాన్ సైదాను పట్టుకున్నారు.
నగరంలో చదువుతున్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు ఇన్ స్టాలో షేక్ జాన్ సైదా పరిచయం అయ్యాడు. సంపన్న కుటుంబానికి చెందిన బాలికను మభ్యపెట్టి, ఆకర్షలు చేసి, ప్రలోభాలు చేశాడు. జూన్ 9 న ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక, తాను తల్లిదండ్రుల దుకాణం వద్దకు వెళ్తున్నానని అమ్మమ్మకు చెప్పి, బయటికి వెళ్లింది. ఇంట్లోంచి బంగారం, నగదు తీసుకెళ్లింది కూడా.. బాలిక తిరిగి రాకపోవడంతో తండ్రి.. పలు ప్రాంతాల్లో గాలించి, చివరికి జూన్ 10 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జాన్ సైదా ఇమెను బైక్ పై తీసుకెళ్లినట్లు పోలీసులు సీసీ టీవీల ద్వారా గుర్తించారు. జూన్ మాసం నుంచి పోలీసులు గాలిస్తున్నా... ఆచూకీ మాత్రం దొరకడం లేదు.

షేక్ జాన్ సైదా ప్రతి సారీ స్థావరాలు మారుస్తూ, పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. ఇప్పటికే పది వరకు సెల్ ఫోన్లు, సిమ్ లు కూడా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్లను కూడా మార్చేశాడు. తమిళనాడులోని ఓ లాడ్జిలో వీరిద్దరూ వున్నట్లు సీసీ కెమెరాలో ఫుటేజీ ద్వారా తెలిసింది. అక్కడి నుంచి పాలక్కాడ్ చేరుకొని, సికింద్రాబాద్ రైలు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. చేతనైతే పట్టుకోండి.. అంటూ బాలిక తల్లిదండ్రులకు ఇన్ స్టా మాధ్యమంగా సవాల్ విసిరాడు. టెక్నాలజీ సాయంతో మొత్తానికి పట్టుకున్నారు. ఇప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.