80 అడుగుల స్తంభం... చిక్కుకున్న స్వరాజ్ పతాకం... ముందుకొచ్చిన సంఘ స్వయంసేవకుడు!

VSK Telangana    05-Sep-2026
Total Views |
trivarna
1936 డిసెంబర్.
 
మహారాష్ట్రలోని ఫైజ్‌పూర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ జరుగుతోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు.
 
స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి.
 
సభా ప్రాంగణంలో దాదాపు 80 అడుగుల ఎత్తైన స్తంభంపై త్రివర్ణ స్వరాజ్ పతాకాన్ని ఎగురవేస్తుండగా అనుకోకుండా తాడు చిక్కుకుని పతాకం మధ్యలోనే నిలిచిపోయింది.
 
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
 
అది నేడు మనం ఉపయోగిస్తున్న అశోక చక్రంతో కూడిన భారత జాతీయ పతాకం కాదు. అప్పట్లో కాంగ్రెస్ ఉపయోగిస్తున్న, మధ్యలో చరఖా ఉన్న త్రివర్ణ స్వరాజ్ పతాకం.
 
పతాకాన్ని సరిచేయడానికి పలువురు ప్రయత్నించారు. కానీ 80 అడుగుల ఎత్తైన స్తంభాన్ని అధిరోహించడం సాధ్యం కాలేదు.
 
వేలాది మంది చూస్తుండగా...
 
జనసమూహం నుంచి ఒక యువకుడు ముందుకొచ్చాడు.
 
అతని పేరు కిషన్ సింగ్ రాజ్‌పుత్.
 
ప్రమాదాన్ని లెక్కచేయకుండా స్తంభాన్ని ఎక్కాడు. పైకి చేరుకుని చిక్కుకున్న తాడును సరిచేశాడు. పతాకం స్తంభంపై పూర్తిగా ఎగిరింది.
 
అక్కడున్న ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఆ యువకుడిని భుజాలపై ఎత్తుకుని అభినందించారు.
 
జవహర్‌లాల్ నెహ్రూ కూడా అతని సాహసాన్ని అభినందించి, బహిరంగ సభలో సత్కరించాలని చెప్పారు,
అయితే ఆ యువకుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖకు వెళ్లే స్వయంసేవకుడు అని తెలిసిన తర్వాత ఆ సత్కారం జరగలేదు.
 
ఈ విషయం తెలుసుకున్న RSS వ్యవస్థాపకులు డా. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ కిషన్ సింగ్‌ను ప్రత్యేకంగా అభినందించి, జ్ఞాపికతో సత్కరించారు.
 
ఈ సంఘటనలో అసలు సందేశం మాత్రం చాలా గొప్పది.
 
ఆ యువకుడు స్తంభం ఎక్కే ముందు—
 
“ఈ పతాకం ఏ సంస్థది?” అని ఆలోచించలేదు.
 
“దీనిని ఎగురవేస్తున్న నాయకుడు ఎవరు?” అని చూడలేదు.
 
దేశ స్వాతంత్ర్య ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన పతాకం చిక్కుకుంది...
 
తాను చేయగల పని కనిపించింది...
 
స్వయంసేవకుడిగా ముందుకొచ్చాడు.
 
దేశం విషయంలో భేదాలకు అతీతంగా స్పందించడమంటే ఇదే.
 
ఈ చారిత్రక సంఘటనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ పరమ పూజనీయ డా. మోహన్ భాగవత్ గారు కూడా ప్రస్తావిస్తూ, పతాక గౌరవం విషయంలో స్వయంసేవకుడు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.