ప్రపంచ పటంలో విప్లవాత్మక మార్పు: ఆఫ్రికా పెద్దదిగా.. ఉత్తర అమెరికా చిన్నదిగా.. ఐరాస కీలక నిర్ణయం!

VSK Telangana    05-Sep-2026
Total Views |
world map
 
న్యూయార్క్: శతాబ్దాలుగా ప్రపంచం చూస్తున్న భూగోళ పట రూపురేఖలను మార్చేస్తూ ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భూఖండాల నిజమైన వైశాల్యాలను ప్రతిబింబించేలా నూతన ప్రపంచ పటాన్ని ఆమోదించింది. ఈ కొత్త పటం ప్రకారం ఆఫ్రికా ఖండం మునుపటి కంటే చాలా పెద్దదిగా, ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్ భూభాగాలు గణనీయంగా చిన్నవిగా కనిపిస్తాయి.
 
పాత పటంలో లోపాలేంటి?
 
క్రీ.శ. 1569 నుండి వాడుకలో ఉన్న 'మర్కేటర్ ప్రొజెక్షన్' (Mercator Projection) పటం ఆధారంగానే ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు, నావిగేషన్ వ్యవస్థల్లో ప్రపంచ పటాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇది గోళాకారంలో ఉన్న భూమిని సమతలంగా చూపించే క్రమంలో ధ్రువ ప్రాంతాలకు (ఉత్తర, దక్షిణ ధ్రువాలు) దగ్గరగా ఉన్న యూరప్, ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్ వంటి ప్రాంతాలను వాటి అసలు విస్తీర్ణం కంటే చాలా పెద్దవిగా చూపిస్తోంది. అదే సమయంలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాలోని కొన్ని భాగాలను చిన్నవిగా చూపిస్తోంది. కాగా, అమెరికా ఈ మేప్ విషయంలో పిల్లల్ల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ వాస్తవ మేప్ కాకుండా, పాత్ మేప్‌నే కొనసాగిస్తానని పేర్కొంది.
 
వాస్తవ విస్తీర్ణం ప్రకారం ఆఫ్రికా ఖండం ఉత్తర అమెరికా కంటే చాలా పెద్దది. ఆఫ్రికా వైశాల్యంలో అమెరికా, చైనా, భారతదేశం మరియు దాదాపు యూరప్ ఖండం మొత్తాన్ని కలిపినా సరిపోతుంది. కానీ పాత పటంలో గ్రీన్‌లాండ్, ఆఫ్రికాలు ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. నిజానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్ కంటే 14 రెట్లు పెద్దది!
 
కొత్త పటం ప్రత్యేకత:
 
ఈ భౌగోళిక వ్యత్యాసాలను సరిదిద్దడానికి 'ఈక్వల్ ఏరియా ప్రొజెక్షన్' పద్ధతిలో రూపొందించిన నూతన పటాన్ని UN అధికారికంగా స్వీకరించింది. ఇది అన్ని ఖండాల సరిహద్దులను, వాటి నిజమైన వైశాల్య నిష్పత్తిలోనే చూపుతుంది.
 
అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యతను ప్రపంచానికి సరైన రీతిలో తెలియజేయడానికి, విద్యా వ్యవస్థలో ఉన్న తప్పుడు అవగాహనలను తొలగించడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని UN ప్రతినిధులు వెల్లడించారు.